ఎవరూ ఏదీ ఉచితంగా చేయరు.. ఏదో ఒకటి ఆశిస్తారు: నోరా ఫతేహి
నోరా ఫతేహి ఇటీవల బాలీవుడ్‌లో తన కఠినమైన ప్రయాణం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. మెల్‌బోర్న్‌లోని IFFMలో రాజీవ్ మసంద్‌తో జరిగిన చిట్ చాట్ లో నోరా చెప్పిన సంగతులు అవాక్కయ్యేలా చేసాయి.
By: Tupaki Desk | 3 Nov 2024 5:13 AM GMT`బాహుబలి`లో మనోహరి గీతంలో నర్తించిన నోరా ఫతేహికి ఇటు తెలుగులోను భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అద్భుతమైన డ్యాన్సింగ్ ప్రతిభతో మతులు చెడగొట్టిన ఈ బ్యూటీ హిందీ డ్యాన్స్ రియాలిటీ షోలలో జడ్జిగా అదరగొడుతూ భారీగా ఆర్జిస్తోంది. మొరాకో నుంచి ముంబైకి ప్రయాణమైన ఈ బ్యూటీ అంతకుముందు కుటుంబ పోషణ కోసం చాలా ఉద్యోగాలు చేసింది. చివరికి షాపింగ్ మాల్ లో కూడా పని చేసానని తెలిపింది.
నోరా ఫతేహి ఇటీవల బాలీవుడ్‌లో తన కఠినమైన ప్రయాణం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. మెల్‌బోర్న్‌లోని IFFMలో రాజీవ్ మసంద్‌తో జరిగిన చిట్ చాట్ లో నోరా చెప్పిన సంగతులు అవాక్కయ్యేలా చేసాయి. సినీపరిశ్రమలో ప్రవేశించినప్పుడు కొత్త వ్యక్తిగా తాను అనేక క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొందో కూడా తెలిపింది. నోరా తనకు సహాయం చేయగలరని భావించిన వ్యక్తులను కలుసుకుంది. కానీ వారిలో హిడెన్ ఉద్దేశ్యాలు వేరుగా ఉన్నాయి. కొందరు ఆమెను పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో కనెక్ట్ చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఇది భయానక పరిస్థితులకు దారితీసింది.
అప్పటికి నోరాకు కేవలం 22 సంవత్సరాలు. కెనడా నుండి భారతదేశానికి అప్పుడే కొత్తగా వచ్చింది. అయితే ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో కొందరు తప్పుడు వ్యక్తులను నమ్మేసిందట. వారంతా మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నారని భావించినట్టు నోరా చెప్పింది. ఇప్పుడు నేను మీతో ఎందుకు వస్తున్నాను? నా నుండి నీకు ఏమి కావాలి? ... అంటే.. స్పష్టంగా.. ఎవరూ ఉచితంగా ఏమీ చేయరు.. ఏదో ఒకటి ఆశిస్తారు. కానీ ఆ సమయంలో ``దేవుడు ఈ వ్యక్తిని నా దగ్గరకు పంపారు అనుకుని నేను చాలా మంది ఇడియట్‌లను అనుసరించాను!`` అని చెప్పింది. ``ఈ వ్యక్తులు ఆమెను సరైన వ్యక్తులకు పరిచయం చేసినా కానీ.. వారిలో కొందరు ప్రతిఫలంగా ఏదైనా కావాలని ఆశించారు. అది అసురక్షితంగా అనిపించింది..`` అని నోరా తెలిపింది. ``ఇది నన్ను నిజంగా భయానక పరిస్థితులలోకి నెట్టింది. చివరికి ఆ వ్యక్తి ``చెయ్యండి.. దీని నుండి నాకేమీ రాదు`` అని అనేవారు. ఇది నిజంగా విచిత్రమైనది ! అని నోరా గతానుభవాలను గుర్తుచేసుకుంది.
నోరా చివరికి నిరాశ పడకుండా ఉండటం నేర్చుకుంది. ఎందుకంటే దీనివల్ల ఇబ్బంది ఎదురవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. నిరాశ చెందక తాను నటనకు సిద్ధంగా ఉన్నానని బలంగా అనుకునేదిట. అయితే చదువుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని కూడా సిద్ధమైంది. కానీ పరిస్థితులు తనను తాను సరిదిద్దుకునేందుకు సహకరించాయని తెలిపింది. అయితే పరిశ్రమలో తాను ఎదుర్కొన్న తిరస్కరణ అనుభవాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. దానిని భరించేందుకు చికిత్స కోసం నిపుణుడిని ఆశ్రయించింది. మరో కత్రినా కైఫ్ అవ్వాలనుకుంటున్నావా? అని కొందరు ప్రశ్నించినట్టు కూడా గుర్తు చేసుకుంది నోరా.
``నేను థెరపీని కోరుకున్నాను.. ఎందుకంటే చాలా తిరస్కరణకు గురైనప్పుడు.. మన చుట్టూ ఉన్నవారు మంచివారు కానప్పుడు థెరపీ అవసరం అని భావించినట్టు నోరా తెలిపింది. చాలా మంది మీరు మరో కత్రినా కైఫ్ అవ్వాలనుకుంటున్నారా? అని ప్రశ్నించేవారు.. ఇది చాలా భయంకరమైనది! అని నోరా ఫతేహి చెప్పింది. నటీనటులకు ఆరంభ రోజులు సవాళ్లతో కూడుకున్నవని కూడా నోరా ఫతేహి పేర్కొంది. ఆమె బాలీవుడ్ కెరీర్‌లో చివరకు ఆశించిన విజయాన్ని సాధించింది. మూవీ టీవీ రంగంలో డిమాండ్ చేసేంతటి పాపులర్ సెలబ్రిటీగా ఎదిగింది.