పిక్‌టాక్ : బ్లాక్‌లో బర్త్‌డే స్పెషల్ కవ్వింపు
టాలీవుడ్‌లో టెంపర్, బాహుబలి, కిక్ 2 సినిమాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించిన కెనడియన్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది
By: Tupaki Desk | 6 Feb 2025 11:30 PM GMTటాలీవుడ్‌లో టెంపర్, బాహుబలి, కిక్ 2 సినిమాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించిన కెనడియన్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది. 2015లో బిగ్‌బాస్ షో లో పాల్గొనడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో ఒక డాన్స్ రియాల్టీ షోలోనూ పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. విదేశీయురాలు అయినా ఇండియాలో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలు అయ్యింది. డాన్సర్‌గా మంచి పేరు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నోరా ఫతేహికి ఎక్కువ శాతం డాన్స్ ప్రధానమైన పాత్రలు, ప్రత్యేక పాటల్లో అవకాశాలు వచ్చాయి.
బాలీవుడ్ చిత్రం సత్యమేవ జయతే సినిమాలో నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులను మెప్పించింది. నటిగా ఫుల్ బిజీగా ఉండే నోరా ఫతేహి ఇటీవల ఒక పుకారుతో వార్తల్లో నిలిచింది. బంగీ జంప్ చేస్తూ ప్రమాదవశాత్తు లోయలో జారి పడిందంటూ పుకార్లు వచ్చాయి. ఆ ప్రమాదంలో నోరా ఫతేహీ చనిపోయిందని ఫేక్ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హడావుడి చేశాయి. కొన్ని గంటల్లోనే నోరా ఫతేహీ టీం ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని, పుకార్లను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు.
నేడు నోరా ఫతేహి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉండే నోరా ఫతేహి ఈసారి బర్త్‌డే స్పెషల్‌గా అంతకు మించి అందమైన ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో చూపు తిప్పుకోనివ్వకుండా అందమైన ఫోటోలను షేర్ చేసిన ఈ అమ్మడు బర్త్‌డే బిహేవియర్ అంటూ తనకు తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేసింది. తన ఫాలోవర్స్‌కి ఈ ఫోటోలతో బర్త్‌డే కానుక ఇచ్చింది.
ఈ మధ్య కాలంలో ఈమె వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలిచింది. సినిమాలు కాస్త తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం ఈమె జోరు తగ్గడం లేదు. దాదాపుగా 50 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న నోరా ఫతేహి ఏం పోస్ట్ చేసినా లక్షల్లో రెస్పాన్స్‌లు వస్తూ ఉంటాయి. ఈ బర్త్‌డే స్పెషల్ అందాల ఫోటోలకు చాలా తక్కువ సమయంలోనే ఏకంగా రెండు లక్షల లైక్స్ తో పాటు వేలాది కామెంట్స్ వచ్చాయి. ఎంతో మంది హ్యాపీ బర్త్‌డే అంటూ కామెంట్ చేసి ఈ ఫోటోలను షేర్ చేశారు.