'క్రిష్ -4' లో హీరోయిన్ ఈవిడేనా?
బాలీవుడ్ సంచలన హిట్ ప్రాంచైజీ `క్రిష్ -4`కి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 April 2025 6:30 PMబాలీవుడ్ సంచలన హిట్ ప్రాంచైజీ `క్రిష్ -4`కి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా రాకేష్ రోషన్ పనిచేస్తూ ఎట్టకేలకు ఫైనల్ చేసారు. `క్రిష్ -4` కి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని, మునుపటి భాగాలకంటే మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడి బాద్యతలు మాత్రం తాను తీసుకోకుండా? ఆ బాధ్యతలు తనయుడు హృతిక్ రోషన్ కే అప్పగించడంతో ఆయనే కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంత వరకూ వెల్లడించలేదు. తొలి భాగంలో ప్రియాంక చోప్రా నటించగా, మలి భాగంలో కంగనా రనౌత్ నటించింది. దీంతో క్రిష్ 4 లో వాళ్లిద్దరిలో ఎవరో ఒకర్ని మళ్లి రిపీట్ చేసే అవకాశం ఉంటుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగింది. ఆ ఛాన్సస్ ఎక్కువగా పీసీకే ఉన్నాయని వినిపించింది. గ్లోబల్ స్థాయిలో ఆమెకు పేరుండటంతో పీసీనే దించుతారని అంతా భావించారు.
పైగా పీసీ నటించిన భాగం అతి పెద్ద విజయం సాధించింది. కంగన నటించిన పార్ట్ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇలా అన్ని కోణాల్లోనూ పీసీకే ఆ ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు. అయితే వాళ్లిద్దరినీ కాకుండా కొత్త భామను ఎంపిక చేసారు. నోరా పటేహీని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో ఫేమస్ బ్యూటీలందర్నీ పరిశీలించి చివరిగా నోరాకే ఆ ఛాన్స్ కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
నోరా పటేహీకిది గొప్పఛాన్స్ అని చెప్పాలి. ఇలాంటి ఛాన్స్ అమ్మడికి ఇంత వరకూ పడలేదు. నటిగా బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ఎక్కువగా ఐటం పాటల్లోనే నటించింది. నటిగా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో క్రిష్-4 కెరీర్ లో గుర్తిండిపోయే గొప్ప ఛాన్స్ అని చెప్పాలి.