Begin typing your search above and press return to search.

నోరా ఫతేహి ఆల్ బ్లాక్ రెట్రో లుక్

'లివింగ్ మై బెస్ట్ లైఫ్' అని నోరా ఈ ఇన్‌స్టా పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. డిజైనర్ మేరీమ్ ఒమైరా షెల్ఫ్‌ల నుండి నలుపు రంగు క్లోసెట్ ఆభరణాన్ని కూడా ధ‌రించింది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 9:30 PM GMT
నోరా ఫతేహి ఆల్ బ్లాక్ రెట్రో లుక్
X

నోరా ఫతేహి ఆల్ బ్లాక్ రెట్రో లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. 'లివింగ్ మై బెస్ట్ లైఫ్' అని నోరా ఈ ఇన్‌స్టా పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. డిజైనర్ మేరీమ్ ఒమైరా షెల్ఫ్‌ల నుండి నలుపు రంగు క్లోసెట్ ఆభరణాన్ని కూడా ధ‌రించింది. ఎంపిక చేసుకున్న దుస్తుల‌కు అనుగుణంగా టైల‌ర్ మేడ్ ఆభ‌ర‌ణాల‌తో త‌ళుకులీనింది.

డ్యాన్సర్ కం న‌టి నోరా ఫ‌తేహి ఉపకరణాలను మినిమంగా ధ‌రించింది. కానీ వజ్రాలతో అలంకరించిన గులాబీ ఆకారంలో ఉన్న కాక్‌టెయిల్ స్టడ్ చెవిపోగులు...అంద‌రినీ ఆక‌ర్షించాయి. నోరా ఫతేహి బ్లాక్ సీక్విన్ గౌను కార్సెట్‌లో ది బెస్ట్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రం వాట్సాపుల్లో హీట్ పెంచుతోంది.

ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ నిర్వ‌హించే (DCA)తో T-సిరీస్ క‌లిసి నోరా ఫ‌తేహి ప‌ని చేయ‌నుంది. నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సంచలనం నోరా ఫతేహిని మేనేజ్ చేయాలంటే డిసిఏతో మా భాగస్వామ్యాన్ని విస్తరించాల‌ని భావించాం..'' అని వ్యాఖ్యానించారు.

ధర్మా కార్నర్‌స్టోన్ ఏజెన్సీ సీఈఓ ఉదయ్ సింగ్ గౌరీ మాట్లాడుతూ.. ''అద్భుతమైన ప్రతిభ నోరా ఫతేహిని మేనేజ్ చేయ‌డం కోసం T-సిరీస్‌తో భాగ‌స్వామ్యం చేసుకోవ‌డం మాకు చాలా ఆనందంగా ఉంది. T-సిరీస్ బ్యానర్‌లో నోరా అద్భుతమైన ప్రయాణం సాగించింది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలతో న‌టించింది. ఇక‌పైనా వైవిధ్య‌మైన కంటెంట్ ని అందిస్తామ‌ని తెలిపారు.