Begin typing your search above and press return to search.

మాన‌సిక రోగుల‌తో కాలం గ‌డిపిన‌దాన్ని!

తాజాగా త‌న జ‌ర్నీ గురించి అమ్మ‌డు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 'నేను నా జేబులో కేవలం రూ. 5000తో భారతదేశానికి వచ్చాను. 1000 డాలర్లు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు.

By:  Tupaki Desk   |   4 April 2024 8:02 AM GMT
మాన‌సిక రోగుల‌తో కాలం గ‌డిపిన‌దాన్ని!
X

బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫ‌టేహీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేడు కోట్ట రూపాయ‌లు పారితోషికం అందుకుంటుంది. అమ్మ‌డిని అభిమానించే వారెంతో మంది ఉన్నారు. నోరా పేరిటి సోష‌ల్ మీడియాలో ఎన్నో ప్యాన్స్ పేజీలున్నాయి. ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్లను క‌లిగిన బ్యూటీ. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఎంతో బిజీగా ఉన్న డాన్స‌ర్ కం న‌టి. ఇదంతా ఇప్పుడు ఒకప్పుడు నోరా వేరు. కెన‌డా నుంచి ఇండియాకి వ‌చ్చిన బ్యూటీ కెరీర్ లోచాలా క‌ష్టాలే ఎదుర్కున్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా త‌న జ‌ర్నీ గురించి అమ్మ‌డు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 'నేను నా జేబులో కేవలం రూ. 5000తో భారతదేశానికి వచ్చాను. 1000 డాలర్లు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. త్రీ బీహెచ్ కే అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మంది మానసిక రోగులతో కలిసి కొన్నాళ్ల పాటు కలిసి ఉన్నాను. అటుపై మరో ఇద్దరు అమ్మాయిలతో గదిని పంచుకున్నాను. నేను ఇప్పటికీ బాధతో ఉన్నాను' అని తెలిపింది. ఇంత‌వ‌వ‌ర‌కూ నోరా వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎక్క‌డా లీక్ చేయ‌లేదు.

తొలిసారి ఇండ‌స్ట్రీ క‌ష్టాల్ని అమ్మ‌డు రివీల్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. నోరా కెన‌డా నుంచి ఇండియాకి రావ‌డంతో అంతా రిచ్ కిడ్ అనుకున్నారు. సినిమాల‌పై ప్యాష‌న్ తో ఇక్క‌డికి వ‌చ్చి స్థిర‌ప‌డింది అనుకున్నారు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన న‌టి అని తెలుస్తోంది.

నోరా ఫ‌టేహీ టాలీవుడ్ లో 'టెంప‌ర్' తోలాంచ్ అయిన బ్యూటీ అటుపై 'షేర్'.''కిక్'-2.. 'లోఫ‌ర్' లాంటి సినిమాల‌తో ఒకే ఏడాది ఇండ‌స్ట్రీలో హంగామా చేసింది. కానీ ఆ మూడు సినిమాల్లో ఏది ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. అటుపై 'ఊపిరి' సినిమా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించలేదు. బాలీవుడ్ లోనే బిజీ అయింది. అక్క‌డ మాత్రం బిజీగానే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో మూడు...నాలుగు ప్రాజెక్ట్ లున్నాయి.

ఈ అమ్మ‌డు కాన్ మాన్ సుకేష్ చంద్ర మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ కూడా ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. సుకేష్ తో స‌న్నిహితంగా ఉండ‌టంతో అమ్మ‌డు చిక్కుల్లో ప‌డింది. ఈ నేప‌థ్యంలో నోరా తాజా వ్యాఖ్య‌ల వెనుక సానుభూతి ప్ర‌య‌త్నిస్తుందా? అన్న సందేహం కొంద‌రి లో క‌లుగుతోంది. ఇంత‌వ‌ర‌కూ లేని వ్యాఖ్య‌లు ఇప్పుడే తెరపైకి రావ‌డం ఏంటో? ఓసారి ఆలోచించాల్సిన విష‌య‌మే అంటున్నారు.