నార్త్ అమెరికా.. పుష్ప-2 రేంజే వేరు!
ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసిన పుష్ప-2.. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది.
By: Tupaki Desk | 13 Dec 2024 11:18 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లిగా మెప్పించిన ఆ సినిమా.. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాలతోపాటు నార్త్ లో పుష్ప-2 వేరే లెవెల్ లో అలరిస్తోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా వసూళ్లను రాబడుతోంది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసిన పుష్ప-2.. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది.
నార్త్ అమెరికాలో పుష్ప సీక్వెల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 మిలియన్ల డాలర్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసేటట్లు కనిపిస్తోంది. సెకెండ్ వీకెండ్ కల్లా క్లియర్ గా అర్థమవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. శనివారం, ఆదివారంలో భారీ వసూళ్లు రానున్నాయని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు నార్త్ అమెరికాలో పుష్ప-2 సెకండ్ హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. తొలి స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి-2.. 20 మిలియన్ల డాలర్లతో ఉంది. మరి దేవర, సలార్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలు ఎంత వసూలు చేశాయంటే?
పుష్ప-2 ఇప్పటి వరకు 10.9 మిలియన్ డాలర్లకు పైగా నార్త్ అమెరికాలో వసూలు చేసింది. అందులో హిందీ వెర్షన్ నుంచి 38 శాతం వచ్చింది. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ 6.1 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అందులో హిందీ వెర్షన్ నుంచి 9 శాతం ఉంది. ప్రభాస్ సలార్.. నార్త్ యూఎస్ లో $8.9 మిలియన్ సాధించింది.
ఆర్ఆర్ఆర్ మూవీ.. ఉత్తర అమెరికాలో 14 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది. కేజీఎఫ్-2.. 7.5 మిలియన్ డాలర్స్ ను రాబట్టింది. కల్కి 2898 ఏడీ మూవీ 15 మిలియన్ డాలర్స్ కు పైగా వసూలు చేసింది. మరి నార్త్ అమెరికాలో పుష్ప-2 ఇంకెంత వసూళ్లు సాధిస్తుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.