Begin typing your search above and press return to search.

నార్త్ అమెరికా.. దేవర మిలియన్ జోరు

మూవీ రిలీజ్ కి ఇంకా 17 రోజుల సమయం ఉండగానే 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన తొలి చిత్రంగా దేవర రికార్డ్ సృష్టించింది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 8:24 AM GMT
నార్త్ అమెరికా.. దేవర మిలియన్ జోరు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు ఇండియన్ భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా దేవర కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ నేడు ముంబైలో రిలీజ్ కాబోతోంది. దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోతాయని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే దేవర సినిమాకి నార్త్ అమెరికాలో అప్పుడే అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అక్కడ దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే షోలకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో దేవర అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ట్రైలర్ రిలీజ్ కాకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ తో 1 మిలియన్ క్లబ్ లో చేరిన మొదటి ఇండియన్ సినిమాగా దేవర నిలిచింది.

మూవీ రిలీజ్ కి ఇంకా 17 రోజుల సమయం ఉండగానే 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన తొలి చిత్రంగా దేవర రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు 1.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ లో మరింత జోరు పెరగడం ఖాయం అని అంటున్నారు.

తెలుగు సినిమాలకి ఈ మధ్యకాలంలో నార్త్ అమెరికాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాలకి కూడా ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేసిన ఇంత వేగంగా ఆ ఫీట్ ని అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఇదే జోరు కొనసాగితే రిలీజ్ రోజుకి 2 మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న దేవర సినిమాకి మొదటి రోజు 100 నుంచి 150 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రిలీజ్ నుంచి రెండు వారాల పాటు దేవర మూవీకి పోటీ ఇచ్చే సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం లేదు. దీంతో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించడం ఖాయం అని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దేవర సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో అద్భుతాలు సృష్టిస్తోన్న దేవర రిలీజ్ తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందనేది వేచి చూడాలి.