బన్నీ అరెస్ట్ పై నార్త్ ఆడియన్స్ ని రియాక్షన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత బన్నీ అరెస్ట్ అవ్వడం ఎన్నో రకాల సందేహాలకు తావిస్తోంది.
By: Tupaki Desk | 14 Dec 2024 11:31 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత బన్నీ అరెస్ట్ అవ్వడం ఎన్నో రకాల సందేహాలకు తావిస్తోంది. కక్షపూరిత చర్యగా భావించి అరెస్ట్ చేసారం టూ బన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం తీరుపై మండి పడుతున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకున్నా అదే చర్య ఘటన తర్వాత వెంటనే ఎందుకు తీసుకోలేదు అనే ప్రధానమైన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నాడని సమాచారం ఉన్నా భద్రతా లోపం ఎందుకు తలెత్తింది? అన్నది మిస్టరీగా మారింది. ఇంకా ఈ కేసు విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు విష యంలో ఆయన న్యాయ నిపుణులు ఈ అంశంపై చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్లాలి? అన్నది ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదంతా పక్కన బెడితే ఉత్తరాది బన్నీ అభిమానులు కూడా అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే అరెస్ట్ తో సినిమాకి ఇంకా పాపులారిటీ పెరుగుతుందనే మాట వినిపిస్తుంది. హిట్ సినిమాకి ఇలాంటి వార్తలు మరింత పబ్లిసిటీ తెచ్చి పెడతాయటూ బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఉత్తరాదిన బన్నీ మాస్ పాపులారిటీ ఈ ఘటనతో రెట్టింపు అవుతుందంటున్నారు.
అరెస్ట్ తర్వాత బన్నీ మీడియా తో మాట్లాడిన విధానం.. తాను చట్టాలను గౌరవించే విధానం గురించి గొప్పగా చెప్పడంతో ఆయనకు మరింత పాజిటివిటీని తెచ్చి పెడుతుంది. ఈ విషయంలో బన్నీ ఎంతో హుందాగా వ్యవహ రించారు. పోలీసులకు పూర్తిగా సహకరించింది తన వైపు నుంచి ఎలాంటి నెగిటివిటీ రాకుండా చూసుకున్నారు.