నార్త్ రిలీజ్.. ఆ సంస్థ చేతుల్లోకి గేమ్ ఛేంజర్
ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా భారీ బడ్జెట్ తో రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 29 Oct 2024 10:04 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా పై టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని భారత దేశంలో ఏకంగా AA ఫిల్మ్స్ ద్వారా నార్త్ ఇండియాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉండబోతుందని సినిమా యూనిట్ ధీమాగా ఉంది.
ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ‘RRR’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ ద్వారా మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందించగా, సినిమా ప్రొడక్షన్ పనుల్లో దిల్ రాజు నిర్మాణ విలువలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా భారీ బడ్జెట్ తో రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని మొదట డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఆ తరువాత ప్లాన్ మార్చులి సంక్రాంతి సీజన్ లో తీసుకు వస్తున్నట్లు అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. పండగ సమయంలో విడుదల చేయడం ద్వారా, ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ విడుదలయిన అన్ని సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది.
అందుకే జనవరి 10న గేమ్ ఛేంజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని సమాచారం, ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, మరొకటి తనయుడి పాత్ర. నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలతో రామ్ చరణ్ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నారు. AA ఫిల్మ్స్ వంటి సంస్థ ద్వారా నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం సినిమా యూనిట్ కి భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశమని భావిస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ లు మరియు శంకర్ దర్శకత్వ ప్రతిభ విశేషంగా కనువిందు చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయితే, రామ్ చరణ్ బాలీవుడ్ లో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయం. మరి బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.