సౌత్‌లో ఒక్క ఛాన్స్ కోసం తహతహ!
మునుపటితో పోలిస్తే ఇప్పుడు సౌత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ తో పోలిస్తే సక్సెస్ రేటు సౌత్ లో ఎక్కువగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 13 Feb 2024 5:30 PM GMTమునుపటితో పోలిస్తే ఇప్పుడు సౌత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ తో పోలిస్తే సక్సెస్ రేటు సౌత్ లో ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు.. సౌత్ నుంచి పాన్ ఇండియా విజయాలు బాలీవుడ్ కి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఇదే ఒరవడిలో ముంబై భామలంతా సౌత్ సినిమాల్లో నటించాలని తపించిపోతున్నారు. ఆలియా భట్, అనన్య పాండే, మృణాల్ ఠాకూర్ ఇప్పటికే తెలుగులో నటించేసారు. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో డెబ్యూ అవుతోంది. ఖుషీ కపూర్ దక్షిణాది ఆరంగేట్రం కోసం బోని పాపా బిగ్ ప్లాన్స్ లో ఉన్నారు. సనయ కపూర్ కన్ను ఇప్పుడు సౌత్ పై ఉంది.
ఆసక్తికరంగా వీరంతా కూడా ఆకాన్షా రంజన్ కపూర్ కి క్లోజ్ ఫ్రెండ్స్. ఆకాంక్ష రంజన్ కపూర్ రెండు సినిమాల కిడ్. కానీ తన పరిధులను విస్తరించడానికి కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. త్వరలో సందీప్ కిషన్ సరసన ఓ సినిమాతో తెలుగు వారికి పరిచయమవుతోంది. 2024 ఇప్పటివరకు చాలా మంచి సంవత్సరం.. తెలుగు పరిశ్రమలో అవకాశం దక్కడం ఆనందం కలిగించింది``అని ఆకాంక్ష తెలిపింది. తాజా ఇంటర్వ్యూ లో నా స్నేహితురాళ్లు అందరూ సౌత్ ఫిల్మ్‌ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సౌత్ లో అద్భుత సినిమాలు చేస్తున్నారు! అంటూ ఆకాంక్ష కితాబిచ్చింది.
తన తాజా సినిమా గురించి మాట్లాడే ముందు ఆకాంక్ష రాంజన్ 2020 నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిత్రం గిల్టీతో అరంగేట్రం చేయడం.. తర్వాత 2021 వెబ్ సిరీస్ `రే` ..2022 నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిత్రం `మోనికా, ఓ మై డార్లింగ్`లో నటించడం గురించి ప్రస్థావించింది. ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన CV కుమార్ `మాయ వన్`లో నటిస్తోంది. సివి కుమార్ 2017 చిత్రం మాయవన్‌కి ఇది సీక్వెల్.
నేను ఇప్పటివరకు నా పని, కుటుంబం, స్నేహితులు, ప్రతిదీ బ్యాలెన్స్ చేయగలిగాను. ఇది నాకు చాలా శాంతి ఆనందాన్ని ఇస్తుంది. ఇలా ఉండటానికే నేను ఇష్టపడతాను అని తెలిపింది. మాయ వన్‌తో తన దక్షిణాది ఆరంగేట్రం గురించి ప్రస్థావిస్తూ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిపింది.
గత మూడు సంవత్సరాలలో మీ జీవితం ఏమైనా మారిందా? అని ప్రశ్నిస్తే.. ఇలా చెప్పింది, ``ఒక విధంగా ఏమీ లేదు. నా స్నేహితులు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, కృషి అలాగే ఉంటాయి. కాబట్టి, ఆ కోణంలో ఏమీ మారలేదు. కానీ నా కెరీర్లో ఇంత పెద్ద మైలురాళ్ళు ఉన్నాయి. ఇటీవల అంతా మారిపోయింది. చివరకు నేను ఎప్పుడూ కలలుగన్న జీవితాన్ని గడుపుతున్నాను. నేను కూడా పెద్ద తెరపై అరంగేట్రం చేయడం ఆనందాన్నిస్తోంది`` అని ఎగ్జయిట్ అయింది ఈ బ్యూటీ.
ఇంకెన్ని తెలుగు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు? అని ప్రశ్నించగా, ఈ సంవత్సరం చివరి నాటికి నేను మరిన్ని చిత్రాలను ప్రకటించగలనని ఆశిస్తున్నాను. తెలుగు వారు ఇప్పుడే నన్ను వదిలించుకోలేరు... అంటూ కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసింది.