Begin typing your search above and press return to search.

అయ్యో తమన్నా కరివేపాకేనా...?

తాజాగా విడుదల అయిన జైలర్ ట్రైలర్ లో తమన్నాకు సింగిల్‌ షాట్ కూడా పడలేదు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 7:20 AM GMT
అయ్యో తమన్నా కరివేపాకేనా...?
X

మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్‌ స్టార్‌ హీరోయిన్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా కూడా అమ్మడి అందాల ఆరబోత ఏమాత్రం తగ్గడం లేదు. ఇన్నేళ్ల కెరీర్‌ లో ఎంతో మంది స్టార్స్ తో.. సూపర్‌ స్టార్స్ తో మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలు చేసింది. తాజాగా ఈ అమ్మడు చిరంజీవి, రజినీకాంత్‌ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.

చిరు తో నటించిన భోళా శంకర్‌ మరియు రజినీకాంత్ తో నటించిన జైలర్ సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుని, ఆ సినిమాల్లో ఈమె పాత్రలు బాగుంటే మరో నాలుగు అయిదు సంవత్సరాలు స్టార్‌ హీరోల సినిమాల్లో మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా తమన్నా కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

జైలర్‌ సినిమా విడుదల అవ్వకుండానే తమన్నా పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విడుదల అయిన జైలర్ ట్రైలర్ లో తమన్నాకు సింగిల్‌ షాట్ కూడా పడలేదు. వా కావాలయ్యా పాటతో సినిమా కు సూపర్‌ క్రేజ్ తెచ్చి పెట్టింది కానీ ట్రైలర్‌ లో మాత్రం చోటు సంపాదించుకోలేక పోయింది.

ట్రైలర్‌ లో ఆమె ను చూపించలేదు అంటే కచ్చితంగా కథ లో పెద్దగా ప్రాముఖ్య ఉండే పాత్ర అయ్యి ఉండక పోవచ్చు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పాపం తమన్నాకు ఈ సమయం లో కూరలో కరివేపాకు వంటి పాత్రలు కాకుండా లీడ్‌ రోల్స్ వస్తాయా అంటూ కొందరు నిట్టూర్చుతూ ఉంటే మరి కొందరు మాత్రం తమన్నా ట్రైలర్ లో లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక భోళా శంకర్‌ లో తమన్నా పరిస్థితి ఏంటో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే. భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇక భోళా శంకర్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా కి మంచి పాత్ర దక్కితే కచ్చితంగా టాలీవుడ్‌ లో ఒకటి రెండు సినిమాల్లో అయినా నటించే అవకాశాలు రావచ్చు.