ఫేక్ కలెక్షన్స్ వివాదం.. నాగవంశీ పిర్యాదుతో ఆ వెబ్ సైట్స్ కి నోటీసులు?
ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 Jan 2024 12:00 PM GMTఈమధ్య సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకి ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ఓ వివాదంగా మారింది. గత డిసెంబర్ లో రిలీజ్ అయిన ప్రభాస్ 'సలార్' సినిమా విషయంలో ఈ ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు వచ్చాయి. ఇక తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు 'గుంటూరు కారం'పై కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా కొన్ని వెబ్సైట్స్ కి చురకలు అంటించారు.
ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగవంశీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కొన్ని వెబ్సైట్స్ కు నోటీసులు జారీ చేసింది అని అంటున్నారు . ఏ వెబ్సైట్స్ అయితే సినిమాల కలెక్షన్స్ వివరాలను ప్రచురిస్తున్నాయో వాటికి సంబంధించిన పారదర్శకత నిరూపించుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొంది అని అంటున్నారు .
రిపోర్ట్ చేసే వారిలో కూడా అకౌంటబిలిటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నోటీసులు పంపించినట్లు అసోసియేషన్ వాళ్లు చెబుతున్నారు ఇక ఈ నోటీసుల్లో కొన్ని ప్రశ్నలు కూడా సంధించినట్లు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన కలెక్షన్ వివరాలను ఎవరు చెబుతున్నారు? మీరు పబ్లిష్ చేసిన డేటా ఎంతవరకు నిజం? మీరు పబ్లిష్ చేసే నంబర్స్ వల్ల ఏదైనా నష్టం జరిగితే ఎవరూ బాధ్యత తీసుకుంటారు?.. ఇలాంటి ప్రశ్నలను ఈ నోటీసుల్లో అడిగినట్లు సమాచారం.
గుంటూరు కారం సినిమాకి 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నాగ వంశీ స్వయంగా ప్రకటించారు. అయితే గతంలో ఓ సినిమా రిలీజ్ అయిన టైంలో నిజమైన కలెక్షన్స్ నిర్మాతలకు తప్ప ఎవ్వరికి తెలియదని, వచ్చిన కలెక్షన్స్ కంటే నిర్మాత కాస్త ఎక్కువగా పెంచి చెబుతారని నాగ వంశీ తెలిపారు.
ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోను తీసుకొచ్చి నాగ వంశీ 212 కోట్లు కలెక్ట్ చేస్తున్నట్టు చెబుతున్న వీడియోకి అటాచ్ చేసి పలువురు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. దీంతో నాగ వంశీ ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు. మరి నోటీసుల వ్యవహారం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి.