అలాగే కాదు డైరెక్టర్లు ఇలా కూడా!
పైగా యాడ్ కాన్సెప్ట్ కూడా తానే స్వయంగా తయారు చేసుకోవడంతో అందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ రూపంలో ఒక్కో యాడ్ ని డైరెక్ట్ చేసి అందుకుంటాడుట.
By: Tupaki Desk | 9 March 2024 5:30 PM GMTహీరోలంతా సినిమాలొక్కటేకాదు..వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాల ద్వారా.. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు చూస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా యాడ్స్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. మహేష్.. ఎన్టీఆర్..రామ్ చరణ్...బన్నీ..విజయ్ దేవరకొండ...రామ్ లాంటి హీరోలు ఎండార్స్ మెండ్స్ విషయంలో ఏమాత్రం తగ్గరు. ఒకరికొకరు పోటీ పడి మరీ సంపాదిస్తున్నారు.
మరి ఇదే తరహాలో డైరెక్టర్లు కూడా సంపాదిస్తున్నారా? సినిమాలతో పాటు యాడ్ ఫిల్మ్స్ ద్వారా కూడా కోట్లు సంపాదించే మేకర్స్ ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇందులో ముందున్నది గురూజీ త్రివిక్రమ్. ఒక్కో యాడ్ ని డైరెక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ భారీగానే ఛార్జ్ చేస్తారుట. పైగా యాడ్ కాన్సెప్ట్ కూడా తానే స్వయంగా తయారు చేసుకోవడంతో అందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ రూపంలో ఒక్కో యాడ్ ని డైరెక్ట్ చేసి అందుకుంటాడుట.
ఏడాదిలో ఇలాంటి యాడ్లు చాలానే చేస్తారుట. అయితే వాటిలో కొన్నింటికి మాత్రమే తన పేరు వేయించు కుంటారుట. చాలాచోట్ల తన పేరుని హైడ్ చేయమనే కంపెనీలకు సూచిస్తారుట. ఇదే తరహాలో సుకు మార్ కూడా యాడ్స్ విషయంలో ముందుంటారుట. అయితే ఈయన చేసే యాడ్స్ ఎక్కువగా విదేశీ బ్రాండ్లకు చెందినవే ఉంటాయట. షూట్ లో భాగంగా ఆయాదేశాల్లోనే చేస్తారుట. ఏటా కనీసం ఐదారు యాడ్స్ అయినా డైరెక్ట్ చేస్తారుట.
ఇక క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కూడా యాడ్స్ విషయంలో భారీగానే ఛార్జ్ చేస్తారుట. ఏ యాడ్ కి కమిట్ అయినా మొత్తం వ్యవహారాలన్ని తానే చూసుకునేలా సదరు కంపెనీతో ఒప్పందం చేసుకుంటారుట. అలాగే అనీల్ రావిపూడి కూడా ఈ మధ్యనే ఈ రూట్ లోకి దిగాడు. ప్రస్తుతం మహేష్ తో ఓ యాడ్ షూట్ చేస్తున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ కూడా యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడుట. తాను డైరెక్టర్ కాక ముందు నుంచే యాడ్ కాన్సెప్ట్ ల్ని డైరెక్ట్ చేసే అలవాటు ఉందిట. ఇప్పటికీ వచ్చిన ఏ అవకాశం వదిలి పెట్టడుట. మొత్తానికి దర్శకులంతా యాడ్స్ షూట్స్ తోనూ బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.