Begin typing your search above and press return to search.

రోజులు మారాయి.. మెగాహీరోలైనా బోల్తా పడాల్సిందే

కంటెంట్ ఉంటేనే కలెక్షన్, లేదంటే హీరో ఎవరైనా, బడ్జెట్ ఎంత పెద్దదైనా.. నిర్మొహమాటంగా గెట్ ఔట్ అంటూ నెగిటివ్ రివ్యూ ఇచ్చేస్తారు ఆడియెన్స్.

By:  Tupaki Desk   |   28 Aug 2023 12:46 PM GMT
రోజులు మారాయి.. మెగాహీరోలైనా బోల్తా పడాల్సిందే
X

కంటెంట్ ఉంటేనే కలెక్షన్, లేదంటే హీరో ఎవరైనా, బడ్జెట్ ఎంత పెద్దదైనా.. నిర్మొహమాటంగా గెట్ ఔట్ అంటూ నెగిటివ్ రివ్యూ ఇచ్చేస్తారు ఆడియెన్స్. ఎప్పుడు నుంచో ఇది కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ మెగా ఫ్యామిలీ విషయానికొస్తే ఇందులో కాస్త మార్పు ఉంటుంది. మొదటి నుంచి గమనిస్తే.. ఆడియెన్స్ లో మెగా కుటుంబానికి ఉండే క్రేజే వేరబ్బా.

అందుకే వారి సినిమాలు డిజాస్టర్, ఫ్లాప్ అయినా వసూళ్లు దాదాపుగా వచ్చేస్తాయి. నిర్మాతలకు నష్టాలు ఏమీ అంతగా ఉండవని చెబుతారు. కెరీర్ లో స్టార్ హీరోగా చిరు ఎదిగిన తర్వాత కూడా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. 'పులి', 'కిరాతకుడు' , 'వేట' 'దైర్యవంతుడు', 'ఆరాధన' , 'రుద్రవీణ', 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్', 'SP పరశురామ్' 'బిగ్ బాస్' 'రిక్షావోడు' 'ఇద్దరు మిత్రులు' 'మృగరాజు' 'అంజి' ఇంకా ఎన్నో చిత్రాలు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ వీటిల్లో చాలా సినిమాలకు మంచి వసూళ్లే వచ్చాయి.

పవన్ కల్యాణ్ కెరీర్ లోనూ అంతే 'గుడుంబా శంకర్', 'అన్నవరం', 'కొమరం పులి', 'కాటమరాయుడు' చెప్పుకుంటూ పోతే చాలానే ఫ్లాప్ లు ఉంటాయి. కానీ అన్నీ మంచి వసూళ్లనే అందుకున్నాయి. మిగతా మెగా హీరోల పరిస్థితి కూడా దాదాపు అంతే. అందుకే దాదాపుగా దర్శకనిర్మాతలు కూడా మళ్లీ మళ్లీ వాళ్లతో సినిమాలు చేస్తుంటారు. మెగా ఫ్యామిలీ అంటే క్రేజ్ అలాంటిది మరి. యూవరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకే మంచి మంచి వసూళ్లు అందుకున్న రోజులు చాలానే ఉన్నాయి. ఆ వసూళ్లే బాక్సాఫీస్ హిట్ టాక్ ను తెచ్చిపెట్టాయి.

కానీ ఇప్పుడు రోజులు మారాయి. ట్రెండ్ మారింది. చిన్న సినిమానా, పెద్ద సినిమానా వ్యత్యాసాలు లేవ్. ప్రస్తుతం ప్రేక్షకులు ఒక సినిమాని ఆదరించాలంటే.. సినిమాలోని నటీనటులు, సినిమా బడ్జెట్ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం అస్సలు లేదు. కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఈ నిజాన్ని నిరూపించాయి. వందల కోట్ల బడ్జెట్ పెట్టాం, మా సినిమాను ఆదరించండి బాబు అంటే కుదరదు. కంటెంట్ లేకపోతే నిర్మొహమాటంగా అలాంటి సినిమాలను డిజాస్టర్ గా పరిగణిస్తున్నారు ఆడియెన్స్. అదే సమయంలో కథలో దమ్ము ఉంటే చాలు చిన్న సినిమా అయినా బ్రహ్మరథం పడుతున్నారు. భారీ స్థాయిలో ఆదరించి సూపర్ హిట్ టాక్ ను కట్టబెడుతున్నారు.

మెగా ఫ్యామిలీ విషయంలోనూ ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. చిరంజీవి ఆచార్య కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ను అందుకుంది. లాంగ్ రన్ టైమ్ లోనూ ఏమాత్రం ఆశించని వసూళ్లను అందుకోలేదు. గాడ్ ఫాదర్ సినిమా కూడా యావరేజ్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన భోళాశంకర్ మరీ దారుణం పరిస్థితి. పైసలే రాలేదు. ఇక వరుణ్ తేజ్ నటించిన గని, తాజాగా గాంఢీవధారి పరిస్థితి అంతే. రూ.50కోట్ల బడ్జెట్ తో తీస్తే.. కనీసం థియేటర్ మెయిన్ టెన్స్ కూడా డబ్బులు రావట్లేదంటున్నారు. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. చిరు భోళశంకర్ కూడా అంతే. ఇక మొన్న వచ్చిన పవన్- సాయితేజ్ బ్రో సినిమా ఏదో అదృష్టం కలిసొచ్చి కాస్త వసూళ్లు సాధించింది కానీ.. అది కూడా ఆయన స్టార్ డమ్ రేంజ్ వసూళ్లను అందుకోలేదు. కాబట్టి పరిస్థితి ఒక్కప్పుడు కూడా లేదు. కంటేంట్ ఉంటేనే బాక్సాఫీస్ హిట్లు, వసూళ్లు. లేదంటే అది మెగా హీరో అయినా సరే బోల్తా పడాల్సిందే.