Begin typing your search above and press return to search.

మండే బ్లూస్ కాదు అమ్మ‌డు మంట‌లు పుట్టించే బ్లూ!

ఏడాదికో సినిమా చొప్పున‌..మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్ ల‌తో కెరీర్ ని నెట్టుకొచ్చింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 12:45 PM GMT
మండే బ్లూస్ కాదు అమ్మ‌డు మంట‌లు పుట్టించే బ్లూ!
X

ఇండియాలో స్వీడ‌న్ బ్యూటీగా ఫేమ‌స్ అయి ఎల్లి అవ్రామ్ సుప‌రిచిత‌మే. `మిక్కి వైర‌స్` తో బాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడి జ‌ర్నీ అటు పై న‌త్త‌న‌డ‌క‌నే సాగింది. ఏడాదికో సినిమా చొప్పున‌..మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్ ల‌తో కెరీర్ ని నెట్టుకొచ్చింది. ఏ ద‌శ‌లోనూ సొగ‌స‌రి బిజీగా న‌టిగా మారింది లేదు. అలాగని ఖాళీగానూ లేదు. వ‌చ్చిన అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ బండి ముందుకు సాగించింది.


ఇటీవ‌లే రిలీజ్ అయిన `గ‌ణ‌ప‌త్` సినిమాలోనూ న‌టించింది. ఇక టెలివిజ‌న్ షోస్..వెబ్ సిరీస్ ల్లో సైతం త‌న‌దైన మార్క్ వేసే ప్ర‌య‌త్నం చేసింది. కానీ అక్క‌డా ఫ‌లించ‌లేదు. ప్ర‌స్తుతానికి చేతిలో సినిమాలైతే లేవు. కొత్త అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది. అమ్మ‌డు మ‌ళ్లీ సౌత్ లోనూ రాణించాల‌ని సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే తెలుగులో ఇంత‌వ‌ర‌కూ లాంచ్ అవ్వ‌లేదు.


త‌మిళ్..క‌న్న‌డ‌లో ఇప్ప‌టికే అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ఇక చివ‌రిగా టాలీవుడ్ ఛాన్స్ ఇస్తుందా? అని ఎదురు చూస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను సోష‌ల్ మీడియాలోనూ అంతే తీర్చిదిద్దుకుంటుంది. ఈ అమ్మ‌డు ప్ర‌త్యేకంగా గ్లామ‌ర్ డోస్ ప‌రంగా ప్ర‌త్యేకంగా షైన్ అవ్వాల్సిన ప‌నిలేదు. స్వీడ‌న్ నుంచి దిగిన బ్యూటీ కాబ‌ట్టి అందాల విందు వ‌డ్డించ‌డం కొత్తేం కాదు. తానేంటో కెరీర్ ఆరంభంలోనే ప్రూవ్ చేసింది.

తానెంత అడ్వాన్స్ గాళ్ అన్న‌ది బాలీవుడ్ లో ఎప్పుడో ప‌రిచ‌యం చేసింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు అంతే యాక్టివ్ గా ఉంటుంది. త‌న‌దైన శైలి ఎలివేష‌న్ల‌తో కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది. తాజాగా సెగ‌లు పుట్టించే ఫోటోతో నెట్టింట చ‌ర్చ‌కు వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలో బ్లూ క‌ల‌ర్ టూపీస్ లో అమ్మ‌డు ఇలా బీచ్ లో సెగ‌లు పుట్టించే భంగిమ‌తో ముందుకు వ‌చ్చేసింది. ఈఫోటోని ఉద్దేశించి `మండే బ్లూస్` అంటూ ఓ క్యాప్స‌న్ ఇచ్చింది. అది మండే బ్లూస్ కాదు..మంట‌లు పుట్టించే బ్లూస్ అంటూ నెటి జ‌నులు కౌంట‌ర్ కి దిగారు.