ఎన్నారైలు టాలీవుడ్ వదిలి వెళ్లే ప్రసక్తే లేదు!
ఇటీవలే రిలీజై డిజాస్టర్ అయిన ఓ పెద్ద సినిమాని నిర్మించిన ఎన్నారై కూడా ఇప్పుడు అమెరికాకు వెళ్లిపోతున్నారంటూ ఒకటే ప్రచారం సాగుతోంది
By: Tupaki Desk | 16 Aug 2023 1:30 AM GMTసినిమా ఇండస్ట్రీ ఒక ఫజిల్ లాంటిది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్లకు గ్యారెంటీలేవీ ఉండవు. ఇటీవలి కాలంలో ఎన్నారై నిర్మాతలు సరైన విజయాల్లేక తిరిగి తమ సొంత వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిపోతున్నారంటూ ప్రచారమవుతోంది. టాలీవుడ్ అగ్ర హీరోల ఏలుబడిలో భారీ పారితోషికాలు చెల్లించలేక చివరికి సినిమా డిజాస్టరైతే భారీ నష్టాలు భరించలేక అమెరికా వెళ్లిపోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం నమ్మేదెలా? అసలు జయాపజయాలతో సంబంధం లేకుండా ఏకంగా 50 సినిమాలు తీసిన సదరు ఎన్నారై నిర్మాత ఈ ఒకట్రెండ్ ఫ్లాపులకే భేజారవుతారా? ...
ఇటీవలే రిలీజై డిజాస్టర్ అయిన ఓ పెద్ద సినిమాని నిర్మించిన ఎన్నారై కూడా ఇప్పుడు అమెరికాకు వెళ్లిపోతున్నారంటూ ఒకటే ప్రచారం సాగుతోంది. ఆయన అమెరికా వెళ్లిపోతాడా లేదా? అన్నది అటుంచితే ఎన్నారైలు రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలు నిలబడకపోతే ఎలా? సినిమా ఇండస్ట్రీ కళ తప్పదూ? ఇక్కడ కేవలం కొందరు మాత్రమే సినిమాలు తీస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీపుల్స్ మీడియా- ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఇలా ఏవో కొన్ని సంస్థలే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇండస్ట్రీకి ఉపాధిని అందిస్తున్నాయి.
అల్లు అరవింద్ - డి.సురేష్ బాబు లాంటి నిర్మాతలు ఏనాడో సైలెంట్ అయిపోయారు. అడపాదడపా మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారు. అందువల్ల సినిమాలు తీసేవాళ్లు ఎప్పటికీ బావుండాలని అంతా కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ కళ తప్పకూడదంటే ఇక్కడికి వచ్చి సినిమాలు తీసే ఎన్నారైలు క్షేమంగా ఉండాలి. లాభాలు ఆర్జించాలి. అప్పుడే వందమందికి ఉపాధి దొరుకుతుంది. వెంట వెంటనే సినిమాలు చేస్తుంటేనే ఇక్కడ ఉపాధికి ఇబ్బంది ఉండదు.
వరుసగా రెండు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి అవి డిజాస్టరవ్వడంతో ప్రముఖ ఎన్నారై నిర్మాత తీవ్ర నిరాశలో ఉన్నారని అతడు అమెరికా వెళ్లిపోతున్నారని ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే తాను ఫ్లాప్ తీసిన హీరోతోనే మరో సినిమా చేస్తానని ఆయన క్లారిటీగా ప్రామిస్ చేయడంతో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎన్నారైలు అమెరికా వెళ్లినా తిరిగి వస్తారు.. వారు అత్యంత శక్తివంతమైన వ్యాపారులు. టాలీవుడ్ ని వదిలిపెట్టరని ఇప్పుడు భరోసా ఉంది.