తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటి విరాళం
విజయవాడ-గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు భారీ వరదతో నీట మునిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Sep 2024 5:38 AM GMTవిజయవాడ-గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు భారీ వరదతో నీట మునిగిన సంగతి తెలిసిందే. జలదిగ్భందంలో ప్రజల ఆర్తనాదాలు కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు యుద్ద ప్రాతిపదిక ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజల్ని ఆదుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వారాళాలు మొదలయ్యాయి.
ఇప్పటికే నిర్మాత అశ్వీనీదత్ 25లక్షలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతోగానే కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తు న్నాను.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నానని ఆయన తెలిపారు.
అలాగే టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బాధితులకు నా వంతుగా సహాయం అంటూ పోస్ట్ చేశారు.`ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో నెలకొన్న వరదలకు సహాయక చర్యలు అవసరం. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షల విరాళం ఇస్తున్నా. వరద బాధితులకు నా వంతుగా ఈ సహకారం.’ అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.5లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదలతో నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు.` అని పోస్టు చేశారు.అలాగే ‘ఆయ్’ మూవీ మేకర్స్ వారంతపు వసూళ్లలో 25 శాతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.