ఎన్టీఆర్ లైనప్‌తో ఫ్యాన్స్‌లో...!
ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల లైనప్ చూసి, కొత్తగా ఎంపిక చేసుకుంటున్న సినిమాలను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 1:30 PM ISTఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం దాదాపు నాలుగు ఏళ్లు కేటాయించారు. 2018లో అరవింద సమేత సినిమాతో వచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత 2022లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని కారణాల వల్ల ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత కూడా ఎన్టీఆర్‌కి గ్యాప్ వచ్చింది. ఆ సినిమా తర్వాత రెండేళ్లకు అంటే 2024లో దేవర సినిమా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా మంచి వసూళ్లను రాబట్టింది. ఎన్టీఆర్ తదుపరి సినిమాలు ఏంటి అంటే చాలా పెద్ద జాబితా ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల లైనప్ చూసి, కొత్తగా ఎంపిక చేసుకుంటున్న సినిమాలను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' సినిమా విడుదల కాబోతుంది. హృతిక్ రోషన్ గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం అయింది కానీ లేదంటే ఇప్పటి వరకు వార్ 2 షూటింగ్ పూర్తి అయ్యేది. షూటింగ్ ఆలస్యం అవుతున్నా కచ్చితంగా సినిమాను ఈ ఏడాది ఆగస్టులోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. 2025లో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 విడుదల కావడం కన్ఫర్మ్. ఇక 2026లో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
డ్రాగన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు సైతం చర్చల దశలో ఉన్నాయి. డ్రాగన్ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా వచ్చే ఏడాదిలో జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి కానుకగా డ్రాగన్ వస్తే ఫ్యాన్స్‌కి పండగే. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా ఏంటి అనే విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరిగాయి. పూర్తి స్థాయి స్క్రిప్ట్‌తో నెల్సన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నెల్సన్ చేస్తున్న సినిమా పూర్తి కావడానికి ఏడాది సమయం పడుతుంది. కనుక ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఆయన సినిమా ఉంటుంది.
ఎన్టీఆర్, నెల్సన్ సినిమా మాత్రమే కాకుండా వచ్చే ఏడాదిలోనే 'దేవర 2' సినిమా సైతం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ రాబోయే మూడు ఏళ్ల వరకు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇలా గతంలో లైనప్ లేకపోవడం వల్లే ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని, ఎన్టీఆర్ సినిమాల లైనప్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్‌లో సంతోషం ఓ రేంజ్‌లో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఇవి కాగా, రెగ్యులర్‌గా ఎన్టీఆర్ కథలు వినడం, ఆయన తదుపరి సినిమాల గురించి చర్చలు జరపడం చేస్తూనే ఉన్నాడు. కనుక రాబోయే మూడు ఏళ్లలో ప్రస్తుతం ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు సైతం యాడ్ అయినా ఆశ్చర్యం లేదు.