Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ దేవరకు స్టాండింగ్ ఓవేషన్..!

బియాండ్ ఫెస్ట్ 2024 స్టేజ్ మీద తారక్ కనిపించగానే అక్కడ ఉన్న వారంతా కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:35 AM GMT
ఎన్టీఆర్ దేవరకు స్టాండింగ్ ఓవేషన్..!
X

ఎన్టీఆర్ దేవర మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను యూఎస్ లో ప్రమోట్ చేసేందుకు తారక్ యూఎస్ వెళ్లాడు. అక్కడ లాస్ ఏంజిల్స్ లోని ఈజిప్టియన్ థియేటర్ లో దేవర ప్రీమియర్ షో వేయనున్నారు. గురువారం వేయనున్న ఈ షో గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఐతే ఈలోగా ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ 2024 లో పాల్గొన్నాడు. బియాండ్ ఫెస్ట్ 2024 స్టేజ్ మీద తారక్ కనిపించగానే అక్కడ ఉన్న వారంతా కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

ఎన్టీఆర్ కు మన దగ్గరే కాదు యూఎస్ లో కూడా ఉన్న క్రేజీ ఫాలోయింగ్ ఏంటన్నది చెప్పేందుకు ఇది నిదర్శనం. RRR సినిమాతో ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ సినిమా తర్వాత వస్తున్న దేవర కోసం పాన్ వరల్డ్ లెవెల్ లో సినీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. లాస్ ఏంజిల్స్ లోని ఈజిప్టియన్ థియేటర్ లో సెప్టెంబర్ 26న దేవర పార్ట్ 1 ప్రీమియర్ షో వేయనున్నారుఇ.

ఈ థియేటర్ లో ప్రీమియర్ షో అనౌన్స్ చేసిన 9 నిమిషాల్లోనే టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి. అంతేకాదు 90 శాతం వెస్ట్రన్ ఆడియన్స్ దేవర 1 టికెట్స్ కొనడం విశేషం. దేవర సినిమా కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదహరణ. వరల్డ్ సినీ లవర్స్ కు దేవర ఎలాంటి ఐ ఫీస్ట్ అందిస్తాడు అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా చేశారు. బియాండ్ ఫెస్ట్ 2024 లో దేవర కోసం ఎన్ టీ ఆర్ పడిన కష్టాన్ని ముఖ్యంగా వాటర్ సీక్వెన్స్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకొచ్చారు. అక్కడ ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేవర సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. దేవర ఇప్పటివరకు అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి వాటిని అందుకునేలా సినిమా ఉంది అంటే కచ్చితంగా ఈ సినిమా నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు.