Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కామెంట్.. అభిమానులకు నచ్చట్లేదు

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే తన కొత్త చిత్రం ‘దేవర’ను తమిళంలో ప్రమోట్ చేశాడు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 2:33 PM GMT
ఎన్టీఆర్ కామెంట్.. అభిమానులకు నచ్చట్లేదు
X

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే తన కొత్త చిత్రం ‘దేవర’ను తమిళంలో ప్రమోట్ చేశాడు. చెన్నైలో టీంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు.. అక్కడి మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ చర్చనీయాంశం అయింది. ఆ స్టేట్మెంట్ స్వయంగా తారక్ అభిమానులకే నచ్చట్లేదని సోషల్ మీడియా చర్చలు, పోస్టులు చూస్తే స్పష్టమవుతోంది. ఈ ఇంటర్వ్యూలో తమిళ టాప్ హీరో విజయ్ డ్యాన్సింగ్ టాలెంట్ గురించి తారక్ మాట్లాడాడు. విజయ్ డ్యాన్సులకు తాను అభిమానినని.. డ్యాన్స్ అనేది డ్యాన్స్ లాగే ఉండాలని.. జిమ్నాస్టిక్స్‌లా అనిపించకూడదని.. విజయ్ చేసినట్లు ఎఫర్ట్‌లెస్‌గా డ్యాన్స్ చేయాలని తారక్ వ్యాఖ్యానించాడు. విజయ్ డ్యాన్సులు కష్టపడి చేస్తున్నట్లు కాకుండా.. ఎఫర్ట్‌లెస్‌గా ఉంటాయని.. అందుకే ఆయన డ్యాన్సులకు పెద్ద అభిమానినని తారక్ అన్నాడు.

ఐతే స్వయంగా తారక్ గొప్ప డ్యాన్సర్ అయి ఉండి విజయ్‌ నృత్యాలకు అభిమానినని చెప్పడం తారక్ పెద్ద మనసును చాటేదే అని.. కానీ విజయ్ డ్యాన్సులను మరీ అంత పొగడాల్సిన అవసరం లేదని తెలుగు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రోమ్‌కు వెళ్తే రోమన్‌ల ా ఉండాలి అనే సూత్ర ప్రకారమే.. తమిళనాట తన సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో తారక్ విజయ్‌ని పొగిడి ఉండొచ్చు. కానీ తెలుగు నెటిజన్లు విజయ్ మీద చాన్నాళ్ల ముందే యుద్ధం ప్రకటించారు. విజయ్ చాలా వరకు తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్లు కొట్టాడు. కానీ ఒరిజినల్స్ కంటే విజయ్ సినిమాలే సూపర్ అని తమిళ జనాలు అతి చేస్తుంటారు. ఒక్కడు, పోకిరి లాంటి సినిమాల ముందు విజయ్ రీమేక్స్ తక్కువ స్థాయిలో కనిపించినా.. తమిళ జనాలు మాత్రం అవే సూపర్ అంటారు. ఎవరైనా సినిమాలు రీమేక్ చేస్తారు కానీ.. విజయ్ మాత్రం తెలుగు పాటలు, డ్యాన్సులను కూడా రీమేక్ చేశాడని ఎద్దేవా చేస్తుంటారు. డ్యాన్సుల్లో తెలుగు హీరోల స్టెప్స్‌ను విజయ్ స్టెప్స్‌ను పోల్చి చూస్తే మన వాళ్లు ఎంత మంచి డ్యాన్సర్లో అర్థమవుతుంది. ఎన్టీఆర్ ‘కంత్రి’ సినిమాలో ఎంతో అందంగా చేసిన ఏనుగు స్టెప్‌ను కూడా విజయ్ చెడగొట్టాడు అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో తారక్ చేసిన కామెంట్స్ తన అభిమానులకే అంతగా నచ్చట్లేదు.