తారక్ ఇంట్లో ఇంత సింపుల్ గా!
ఆ రోజు కచ్చితంగా అన్నయ్య కళ్యాణ్ రామ్ అక్కడే ఉంటాడు.
By: Tupaki Desk | 24 Sep 2024 5:47 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిపెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో అతడో సంచలనం. భారీ స్టార్ డమ్ గల నటుడు. వెయి కోట్లు వసూళ్లు సాధింగల సత్తా ఉన్న నటుడు. అలాంటి స్టార్ ఇంట్లో ఎలా ఉంటాడో? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్టీఆర్ కి బిర్యానీ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆదివారం పూట తానే స్వయంగా బిరియానీ చేసి వడ్డిస్తాడు. ఆ రోజు కచ్చితంగా అన్నయ్య కళ్యాణ్ రామ్ అక్కడే ఉంటాడు.
ఇది అందిరికీ తెలిసిన తారక్. మరి కొరాటాలకు తెలిసిన తారక్ ఇంకా సింపుల్ గా ఉంటాడని. అవును ఈ విషయం కొరటాల రివీల్ చేసాడు. 'ఎన్టీఆర్ ఎంతో సింపుల్ పర్సన్. తానో స్టార్ అనే అహంభావం ఉండదు. ఇంట్లో చాలా సింపుల్ గా ఉంటారు. నేను వెళ్లిన ప్రతీసారి వంటగదిలో నే కనిపించారు. ఎక్కువగా వంట గదిలో ఉంటారునుకుంటే? ఇప్పుడు అక్కడే ఉంటునని తారక్ అన్నారు. అలాగే పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తారు.
వాళ్లతో సరదాగా ఆడుకుంటారు. ఆ సమయంలో తాను చిన్న పిల్లాడు అయిపోతాడు. తారక్ ఇలా ఉంటారని ఎవరికీ తెలియదు. ఆయనతో ప్రయాణం చేసిన నాకు తెలుసు. ఇలా ఉండటం అంటే ఎంతో ఇష్టం అని తారక్ కూడా అన్నారు. ప్లూయిడ్ గా ఉండటం అంటే ఇష్టమని...మనసులో అన్నీ దాచు కోవడం ఇష్టం ఉండదని...బయటకు అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేస్తానని తారక్ కూడా మాటల మధ్యలో అంటారు.
బేసిక్ గా తారక్ మంచి మాటకారి. ఎంత అల్లరి చేస్తాడో? అంతకుమించి ఎంతో మెచ్యూర్డ్ గా ఉండాల్సిన చోట ఉంటాడు. అదే తారక్ లో స్పెషాల్టీ. ఈ మధ్య కాలంలో తారక్ మాటలు అభిమానులకు మరింత బలగా తాకుతున్నాయి. అతడు మాట్లాడే ప్రతీ మాట ఎంతో ప్రాక్టికల్ గా ఉంటుంది.