జపాన్ లో రిలీజ్ కి ముందే టైగర్ విధ్వంసం!
ఇద్దరు కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' జపాన్ లో గ్రాండ్ విజయం సాధించడంతో? ఆ ఇద్దరికి ఒక్క సినిమాతోనే ఎనలేని గుర్తింపు దక్కిందక్కడ.
By: Tupaki Desk | 18 March 2025 11:57 AM ISTజపాన్ మార్కెట్ ని టాలీవుడ్ స్టార్లు ఎలా టార్గెట్ చేసారో చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ జపాన్ మార్కెట్ కోసం పోటా పోటీగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ మార్కెట్ లో రామ్ చరణ్ -ఎన్టీఆర్ మధ్య పోటీ కనిపిస్తుంది. ఇద్దరు కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' జపాన్ లో గ్రాండ్ విజయం సాధించడంతో? ఆ ఇద్దరికి ఒక్క సినిమాతోనే ఎనలేని గుర్తింపు దక్కిందక్కడ.
జపాన్ లో ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మొదటి భాగం జపాన్ రిలీజ్ కి రెడీ అయింది. మార్చి 28న చిత్రం జపాన్ లో రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా తారక్ ప్రచారం కోసం 22న జపాన్ బయల్దేరుతున్నాడు. అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ మధ్య లండన్ లో ఓ ఈవెంట్ కి హాజరైన సమయంలో జపాన్ కి రావాలని ప్రత్యేకంగా ఓ అభిమాని ఆహ్వానించారు.
ఆ సమయంలో తప్పకుండా వస్తానంటూ తారక్ మాట ఇచ్చారు. `దేవర` ప్రచారంలో భాగంగా ఇప్పుడు రెండు పనులు పూర్తవుతాయి. ప్రచారంతో పాటు అభిమానుల్ని కలిసినట్లు ఉంటుంది. అయితే ఈ సినిమా అక్కడ రిలీజ్ కి ముందే గత రాత్రి ప్రత్యేక ప్రైవేట్ ప్రివ్యూ షో వేసారు. దీనికి అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. సినిమాకి ప్రీవ్యూతో పాజిటివ్ టాక్ వచ్చింది.
యంగ్ టైగర్ లో మాస్ యాంగిల్ కి అక్కడ అభిమానులు బలంగా కనెక్ట్ అయ్యారు. దీంతో థియేట్రికల్ రిలీజ్ పై అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేవర మొదటి భాగంగా జపాన్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందనే నమ్మకం తెలుగు అభిమానుల్లో రెట్టింపు అయింది. ఈ చిత్రాన్ని మిక్కి లినేని సుధాకర్- కొసరాజు హరి- నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.