వీడియో : ఎన్టీఆర్ క్రేజ్... ఇది నిజంగా జపాన్‌లోనే!
నైజాం ఏరియాతో పాటు సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉంటారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో నేరాలు జరిగిన విషయం తెల్సిందే
By: Tupaki Desk | 26 March 2025 10:56 AMఎన్టీఆర్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నైజాం ఏరియాతో పాటు సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉంటారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో నేరాలు జరిగిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకుల్లో అత్యధిక అభిమానులు ఉన్న హీరోల జాబితాలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల వరకే ఎన్టీఆర్ క్రేజ్ పరిమితం అనుకుంటే పొరపాటే. దేవర సినిమా ప్రమోషన్స్ కోసం గత ఏడాది నార్త్ ఇండియా వెళ్లిన సమయంలో అక్కడి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తెలిసిందే. నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ ఫాలోయింగ్‌కి బాలీవుడ్ సైతం షాక్ అయింది.
ఇండియాలోనే కాకుండా ఎన్టీఆర్‌కి వేరే దేశంలోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందని మరోసారి నిరూపితం అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఇక్కడ గత ఏడాది విడుదలైన దేవర సినిమాను జపాన్‌లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లబోతున్నారు. దేవర సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లారు. అక్కడ గత మూడు రోజులుగా అభిమానులతో సందడి చేస్తున్నారు. వెళ్లిన ప్రతి చోట ఎన్టీఆర్‌కు దక్కుతున్న ఆధరణ చూసి అంతా షాక్ అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి మీడియాలో ఎన్టీఆర్‌కి దక్కుతున్న గౌరవం, అభిమానం గురించి ప్రముఖంగా కథనాలు వస్తున్న విషయం తెల్సిందే.
దేవర సినిమా ప్రివ్యూ షో కి ఎన్టీఆర్ హాజరు అయ్యాడు. అక్కడ అభిమానులు వేసిన డాన్స్‌కి అంతా ఫిదా అయ్యారు. చివరకు ఎన్టీఆర్ సైతం వారితో కలిసి స్టెప్స్ వేసి అక్కడకు వచ్చిన అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా మరో భారీ ఈవెంట్‌కి ఎన్టీఆర్ హాజరు అయ్యాడు. అక్కడ అభిమానులను చూసి ఎన్టీఆర్ సైతం షాక్ అయ్యి ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎలా ఉంటుందో జపాన్‌లో దేవర ప్రీవ్యూ షో వేసిన భారీ థియేటర్‌లో అలాంటి పరిస్థితి కనిపించింది. ఒక భారీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రివ్యూకి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ అక్కడకు వెళ్లిన వెంటనే జనాల నుంచి వచ్చిన స్పందన తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జపాన్ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఎన్టీఆర్ సైతం అవాక్కవుతూ ఉంటాడు. జపాన్ ప్రేక్షకుల నుంచి దక్కిన ఆదరణ కు సంబంధించిన ఒక వీడియోను ఎక్స్ ద్వారా ఎన్టీఆర్ స్పందించాడు. ఇంతటి గొప్ప ఆదరణ కు సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు జపనీస్ ప్రేక్షకులు దేవర సినిమాను చూస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటించాడు. కనుక జపనీస్‌కి ఆ పాయింట్ మరింత ఎక్కువ హైప్ తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవర 2 సినిమాను త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా 'డ్రాగన్' షూటింగ్‌లో పాల్గొంటాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. మరో వైపు వార్ 2 లోనూ ఎన్టీఆర్ నటించిన విషయం తెల్సిందే. ఆగస్టులో సినిమాను విడుదల చేసే విధంగా వార్ 2 మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.