Begin typing your search above and press return to search.

దేవర హైలైట్స్ లీక్.. ఎలా సాగుతుందంటే..

ఈ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే దేవరపై మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 3:48 AM GMT
దేవర హైలైట్స్ లీక్.. ఎలా సాగుతుందంటే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే దేవరపై మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది.

ఎన్టీఆర్ సినిమాలలో ఇప్పటి వరకు చూడనటువంటి ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయనే మాట వినిపిస్తోంది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ దేవర మూవీకి హైలైట్ గా నిలుస్తాయంట. అలాగే 4 యాక్షన్ ఘట్టాలని చాలా పవర్ ఫుల్ గా కొరటాల శివ డిజైన్ చేసాడని టాక్. పెద్ద దేవర పైన వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ కి గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. అలాగే చిన్న దేవర మీద నడిచే సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్ మిక్స్ అయ్యి ఉంటుందంట.

సినిమాలో రెండు సాంగ్స్ విజువల్ ట్రీట్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవల్ లో ఇమాజినేషన్ కి అందనంత దూరంగా ఉంటాయని అంటున్నారు. వీటికి అదనంగా సైఫ్ అలీఖాన్ విలనీ పెర్ఫార్మెన్స్, శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని టాక్. ముఖ్యంగా చివరి 40 నిమిషాల మూవీ కంటెంట్, విజువల్స్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ లెవల్ లో సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసినట్లు ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ మూవీస్ లో దేవర ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ కథపై తారక్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఆయన మాటల బట్టి అర్ధమవుతోంది. కచ్చితంగా కొరటాల శివ దేవర సినిమాతో తనని తాను బెస్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే మాట వినిపిస్తోంది.

ఓవరాల్ గా మూవీ చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్ ని అందిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ పై పూర్తిగా ఫోకస్ చేశారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సినిమాని ప్రేక్షకులకి రీచ్ చేసే ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందనేది వేచి చూడాలి.