Begin typing your search above and press return to search.

నార్త్ లో దేవర… కల్కిని టచ్ చేస్తుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 Sep 2024 5:30 PM GMT
నార్త్ లో దేవర… కల్కిని టచ్ చేస్తుందా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా ‘దేవర’ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లోనే సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దేవర’ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కి హిందీ బెల్ట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు తర్వాత హిందీలోనే ‘దేవర’ మూవీ ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో ‘దేవర’పై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. హిందీ ఆడియన్స్ ‘ఆర్ఆర్ఆర్’ తో తారక్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాకి మొదటి రోజు హిందీలో ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయో చూడాలనే ఇంటరెస్ట్ అందరిలో ఉంది. ఈ ఏడాది ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ మూవీ హిందీలో మొదటి రోజు 21 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

నిజానికి ‘కల్కి’ 15 కోట్ల వరకు మొదటి రోజు వసూళ్లు చేస్తుందని అంచనా వేశారు. అయితే ‘కల్కి’ మూవీ ట్రేడ్ పండితుల అంచనాలని దాటిపోయే భారీ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ‘దేవర’ మూవీ కూడా మొదటి రోజు 5-6 కోట్ల మధ్యలో హిందీ బెల్ట్ లో మొదటి రోజు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం 8-10 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ‘దేవర’ మొదటి రోజు హిందీలో 10 కోట్ల గ్రాస్ అందుకుంటే మాత్రం కచ్చితంగా అది సెన్సేషన్ రికార్డ్ అని చెప్పొచ్చు.

‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్స్ రికార్డ్ ని హిందీలో మొదటి రోజు దేవర బ్రేక్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేసినట్లే అని అంటున్నారు. దేవర మూవీలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలలో నటించారు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ హిందీ మార్కెట్ లో దేవరకి కొంత సానుకూల అంశంగా ఉంది. అది మూవీకి ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ అందిస్తుందనేది చూడాలి.

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ హిందీలో 65 కోట్ల కలెక్షన్స్ ని ఓవరాల్ గా కలెక్ట్ చేసింది. ‘దేవర’ తో మొదటగా ‘హనుమాన్’ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే లాంగ్ రన్ లో ‘దేవర’ మూవీ హిందీలో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. యూఎస్ లో కూడా ‘దేవర’ మూవీ మొదటి రోజు 2 మిలియన్ డాలర్స్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.