Begin typing your search above and press return to search.

దేవర సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎక్కువే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానుంది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 4:00 AM GMT
దేవర సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎక్కువే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమా కోసం కొరటాల శివ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు.

సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. అతని పాత్ర చాలా కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ట్రైలర్ తో మూవీ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకుంటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు హెవీగానే ఉన్నాయి.

వాటిని ఏ మాత్రం తారక్ అందుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే దేవర మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు నుంచి వచ్చింది. పలు యాక్షన్ సీన్స్ లో రక్తపాతం ఎక్కువగా ఉన్నా సెన్సార్స్ కట్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది దేవర సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలు. లెంగ్త్ ఎక్కువైనా కూడా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఈ మూవీ ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

తెలుగులో ఆమెకిది డెబ్యూ మూవీ. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ట్రైలర్ రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సైఫ్ కరణ్ జోహార్ భాగమయ్యారు. ఆయన దగ్గరుండి హిందీ మార్కెట్ లోకి దేవర సినిమాని పంపించే బాధ్యత తీసుకున్నారు.

ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తోన్న నేపథ్యంలో హృతిక్ రోషన్ కూడా దేవర మూవీ ప్రమోషన్స్ కి వచ్చే అవకాశం ఉందనే మాట బిటౌన్ లో వినిపిస్తోంది. ఒక వేళ హృతిక్ రోషన్ వస్తే మాత్రం కచ్చితంగా బాలీవుడ్ లో దేవర సినిమాకి ప్లస్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగులో కూడా దేవర మూవీ ప్రమోషన్స్ కోసం స్టార్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.