ముంబైలో తారక్..పాత జ్ఞాపకాల్లోకి జారుకుంటున్నాడా?
మళ్లీ ఇప్పుడు 'దేవర' కోసం తారక్ మళ్లీ ముంబైని రౌండప్ చేసినట్లు కనిపిస్తుంది. 'దేవర' ట్రైలర్ రిలీజ్ సందర్బంగా తారక ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Sep 2024 11:13 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్రచార పరంగా తొలిసారి ముంబై వెళ్లింది 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ సమయంలోనే. ఆ సినిమాని ముంబైలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. తారక్ తొలి పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఎంతో డెడికేట్గా పాల్గొన్నారు. టీవీ ఇంటర్వ్యూలు..వ్యక్తిగత ఇంటర్వ్యూ లూ..టాక్ షోలు...ఇలా ఒకటేంటి రామ్ చరణ్ తో కలిసి ముంబై మీడియాని షేక్ చేసాడు.
తారక్ చలాకీ తనంతో ఆ షోలు ఎంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ముంబైకి వెళ్లింది లేదు. మళ్లీ ఇప్పుడు 'దేవర' కోసం తారక్ మళ్లీ ముంబైని రౌండప్ చేసినట్లు కనిపిస్తుంది. 'దేవర' ట్రైలర్ రిలీజ్ సందర్బంగా తారక ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. తారక్ ఫోటోలిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా లో అసాధారణ గుర్తింపు దక్కడంతో ప్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు రెట్టింపు అయింది.
జై ఎన్టీఆర్ ఆనే నినాదం ముంబైలో సైతం గట్టిగానే వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ కరణ్ జోహర్ రిలీజ్ చేయడం కలిసొచ్చే అంశం. రిలీజ్ సమయంలో అతడి టాక్ షోలతో దేవరని ఈజీగా జనాల్లోకి తీసుకెళ్తాడు. పైగా హీరోయిన్ జాన్వీ కపూర్ కాబట్టి నార్త్ ఆడియన్స్ కి మరింత కిక్ దక్కుతుంది. ఇది ట్రైలరే. రిలీజ్ సమయంలో తారక్ మరింత హంగామా చేస్తాడు? అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇది అతడి సోలో పాన్ ఇండియా సినిమా కాబట్టి మరింత శ్రద్దగా ప్రచారంలో పాల్గొంటాడు. ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహంతోనూ ఎంగేజ్ చేస్తాడు. ఇటీవలే స్వస్థలం కర్ణాకట వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి దేవాలయాల ప్రదర్శనకు స్నేహితుడు రిషబ్ శెట్టి తో కలిసి వెళ్లాడు. ఆ ఫోటోలకు నెట్టింట మంచి రెస్పాన్స్ వచ్చింది. పనిలో పనిగా దేవర ప్రచారం బ్యాకెండ్ లో జరిగిపోయింది.