దేవర.. తారక్ అన్ని కోట్లు తీసుకున్నారా?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 15 Sep 2024 10:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్నారు. నిన్ను చూడాలని మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన తారక్.. ఆ తర్వాత స్టూడెంట్ నెం.1తో స్టార్ హీరోగా మారిపోయారు. చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అనంతరం అనేక సినిమాల్లో ఎన్టీఆర్ నటించారు.
సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనంతో పాటు అనేక చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. మధ్యలో శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా, రామయ్యా వస్తావయ్యా వంటి పలు సినిమాలు ఫ్లాపులుగా నిలిచినా.. టెంపర్ మూవీతో ఫామ్ లోకి వచ్చేశారు. చివరగా ఆర్ఆర్ఆర్ తో వేరే లెవల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్.. దేవర పార్ట్-1తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానున్న ఆ సినిమాలో తారక్.. డ్యుయల్ రోల్ పోషించారు. అందుకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ ఇప్పటికే ట్రైలర్ ద్వారా రివీల్ అయింది. అయితే ఈ సినిమాకు గాను తారక్ తీసుకున్న రెమ్యునరేషన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్.. దేవరకు గాను భారీగా పారితోషికం అందుకున్నారని, 33 శాతం పెంచారని వార్తలు వస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దేవరకు రూ.60 కోట్లు అందుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. అంటే తారక్ రెమ్యునరేషన్ లో 33 శాతం పెరిగినట్లు చెబుతున్నారు నెటిజన్లు. ఈ విషయంలో నిజమెంత అనేది తెలియకపోయినా.. నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది.
అయితే దేవరతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. విలన్ గా కనిపించనున్న సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షల పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఓవరాల్ గా భారీ బడ్జెట్ తో రూపొందిన దేవరతో తారక్ ఎలా హిట్ కొడతారో వేచి చూడాలి.