Begin typing your search above and press return to search.

దేవర థర్డ్ సింగిల్ పై రవి చందర్ క్రేజీ అప్డేట్..

ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవర మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన

By:  Tupaki Desk   |   1 Sep 2024 8:53 AM GMT
దేవర థర్డ్ సింగిల్ పై రవి చందర్ క్రేజీ అప్డేట్..
X

తెలుగు సినీ లవర్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ మూవీతో తన వరల్డ్ వైడ్ తన సత్తా చాటుకున్న ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవర మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటివరకు మూవీ నుంచి రెండు పాటలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం నుంచి త్వరలో థర్డ్ సింగిల్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

దేవర చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న రవి చందర్ తాజాగా థర్డ్ సింగిల్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫియర్, చుట్టమల్లె పాటలు యూట్యూబ్లో ప్రేక్షకులను చుట్టేస్తున్నాయి. అయితే ఈ రెండు పాటలను మించి ఎన్టీఆర్, జాన్వి మధ్య మంచి రొమాన్స్ తో దావుడి అనే పాటతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నారు.

ఇక ఈ మూవీ గురించి తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్న రవి చందర్..’దేవర చిత్రం నుంచి దావుడి అనే థర్డ్ సింగిల్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఈ పాటలో తారక్ అన్న తన స్టెప్పులతో ఇరగదీసాడు.. జాన్వి కపూర్ మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ అస్సలు మిస్ కాలేరు. ఈ మూవీ తో కొరటాల శివ సార్ కచ్చితంగా ఓ భారీ హిట్ కొట్టేస్తారు’అని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ కావడంతో రాబోయే థర్డ్ సింగిల్ కోసం తారక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉన్నాయి. ఇప్పటికే చుట్టమలే పాటతో జాన్వి, ఎన్టీఆర్ జోడి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.ఇక దావడి లో ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫామెన్స్ కి జాన్వి ఏ రేంజ్ లో మ్యాచ్ అవుతుందో చూడాలి మరి.