Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ మ‌ళ్లీ జ‌పాన్ వెళ్తాడా?

'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ స‌మ‌యంలో తార‌క్ జపాన్ వెళ్లి ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి 'దేవ‌ర' ప్రచారం కోసం జపాన్ వెళ్తారా? లేదా? అన్న‌ది చూడాలి.

By:  Tupaki Desk   |   26 Dec 2024 8:00 AM GMT
యంగ్ టైగ‌ర్ మ‌ళ్లీ జ‌పాన్ వెళ్తాడా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 'దేవ‌ర' పాన్ ఇండియాలో భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద వసూళ్లు ఏమాత్రం త‌గ్గ‌లేదు. 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత తారక్ నుంచి రిలీజ్ అయిన సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. దీంతో 'దేవ‌ర 2' కోసం మ‌రింత స‌మ‌యం తీసుకుని ది బెస్ట్ ప్రొడ‌క్ట్ ఇవ్వాల‌ని రెడీ అవుతున్నారు. అయితే 'దేవ‌ర' ఇప్పుడు జ‌పాన్ లోనూ రిలీజ్ అవుతుంది.

వ‌చ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ అవుతుంది. 'క‌ల్కి 2898' చిత్రాన్ని జ‌పాన్ లో రిలీజ్ చేసిన ట్విన్ సంస్థ అక్క‌డ రిలీజ్ చేస్తుంది. టికెట్ విక్ర‌యాలు జ‌న‌వ‌రి 3న ప్రారంభ‌మ‌వుతాయి. అయితే జ‌పాన్ లో ఎన్ని స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతుంది? అన్నది క్లారిటీ రావాలి. ఇంత‌వ‌ర‌కూ ఆ అప్ డేట్ రాలేదు. జ‌పాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'ఆర్ ఆర్ ఆర్' తో అక్క‌డ భారీ అభిమానుల్ని సంపాదించాడు. ఆ విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ కంటే మ‌రింత మెరుగ్గా ఉన్నాడు.

భీమ్ పాత్ర‌కు అక్క‌డ ప్రేక్ష‌కులు ఫిదా అవ్వ‌డంతోనే తార‌క్ కి ఆస్థాయిలో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అమెరికాలో పాల్గొన్న ఓ ఈవెంట్ లో తార‌క్ ని చూడ‌టం కోసం ఏకంగా జ‌పాన్ నుంచే అభిమానులు అమెరికాకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన అయింది. స‌ద‌రు అభిమానికి తార‌క్ సెల్పీలు కూడా ఇచ్చి పంపించాడు. అలా తార‌క్ జ‌పాన్ ఫాలోయింగ్ బ‌య‌ట ప‌డింది.

'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ స‌మ‌యంలో తార‌క్ జపాన్ వెళ్లి ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి 'దేవ‌ర' ప్రచారం కోసం జపాన్ వెళ్తారా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌భాస్, ర‌జ‌నీకాంత్ లాంటి సూప‌ర్ స్టార్ల‌కు జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వాళ్ల సినిమాల‌న్నీ అక్క‌డ త‌ప్ప‌క రిలీజ్ అవుతుంటాయి.

జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో భారీ అభిమానులను సంపాదించుకున్నాడు, ముఖ్యంగా RRR విజయం తర్వాత మరియు అతని ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. జపాన్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు.