Begin typing your search above and press return to search.

తార‌క్ వ‌ర్సెస్ తార‌క్!

ప్ర‌స్తుతం షూటింగ్ ముంబైలో వేసిన ప్ర‌త్యేక సెట్ల‌లో జ‌రుగుతోంది. అందులో తార‌క్ కూడా పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2025 5:30 PM GMT
తార‌క్ వ‌ర్సెస్ తార‌క్!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `వార్ -2` తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఆయాన్ ముఖ‌ర్జీ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే తార‌క్-హృతిక్ మ‌ధ్య భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని ప్ర‌చారంలో ఉంది. అలాగే ఇద్ద‌రి మ‌ధ్య ఓ స్పెష‌ల్ సాంగ్ సైతం ఉంటుంద‌ని వినిపిస్తుంది. ఇద్ద‌రు మంచి డాన్సర్లు కావ‌డంతో అందులో పోటా పోటీ త‌ప్ప‌దు.

ప్ర‌స్తుతం షూటింగ్ ముంబైలో వేసిన ప్ర‌త్యేక సెట్ల‌లో జ‌రుగుతోంది. అందులో తార‌క్ కూడా పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. తార‌క్ ఇందులో రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారట. దీనిలో భాగంగా తార‌క్ వ‌ర్సెస్ తార‌క్ అన్న‌ట్లు ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య ఉంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

`వార్` లో కూడా టైగ‌ర్ ష్రాప్ రెండు డిఫ‌రెంట్ షేడ్స్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తార‌క్ పాత్ర‌ని మ‌రింత బ‌లంగా చూపించ‌బోతున్నారట‌. దీంతో తార‌క్ పై ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి పెరిగిపోతుంది. ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎంతో క్రియేటివ్ గా రియ‌లిస్టిక్ గా తీర్చిదిద్దుతున్నారట‌. యాక్ష‌న్ స‌న్నివేశాల‌కే భారీగా ఖ‌ర్చు చేస్తున్నారుట‌.

ఆ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా ముందుకెళ్తున్నారట‌. తార‌క్ పై చిత్రీక‌ర‌ణ కూడా దాదాపు ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల‌ఖ‌రుతో తార‌క్ పోర్ష‌న్ షూటింగ్ పూర్త‌వుతుందంటున్నారు. షూటింగ్ అంతా ఏప్రిల్ క‌ల్లా ముగిస్తార‌ని వార్త‌లొస్తున్నాయి.