Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లో ఆ ఊర మాస్ ఎప్పుడు చూస్తామో..!

వార్ 2 సినిమాను బాలీవుడ్ మేకర్స్ తెరకెక్కిస్తున్నా ఎన్టీఆర్ సౌత్ ఇమేజ్ అదే టాలీవుడ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 March 2025 9:30 PM
ఎన్టీఆర్ లో ఆ ఊర మాస్ ఎప్పుడు చూస్తామో..!
X

మాస్ హీరో నుంచి స్టైలిష్ యాక్టర్ గా మారిన ఎన్టీఆర్ తన మార్క్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ దేవర 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న తారక్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. వార్ 2 సినిమాను బాలీవుడ్ మేకర్స్ తెరకెక్కిస్తున్నా ఎన్టీఆర్ సౌత్ ఇమేజ్ అదే టాలీవుడ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వార్ 2 సినిమాను తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

వార్ 2 తర్వాత నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా గురించి నిర్మాత రవి శంకర్ మీరు ఏ స్టాండర్డ్స్ ఊహించుకున్నా దాన్ని మించే అని చెప్పారు. ఐతే ఎన్టీఆర్ ఈమధ్య సినిమాలు చూస్తే మాస్ గానే ఉంటున్నా ఒకప్పుడు తను సినిమాల్లో ఉన్న ఊర మాస్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ అవే తీస్తూ ఉండటం వల్లే మూస కథలని ఫ్యాన్స్ కూడా తిప్పికొట్టారు.

ఎన్టీఆర్ కెరీర్ మొదలోనే ఆది, సింహాద్రి లాంటి ఊర మాస్ హిట్లు కొట్టాడు. ఫ్యాక్షన్ సినిమాలు, ఊర మాస్ సినిమాలు చేయాలంటే ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అనేలా చేసుకున్నాడు. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ అలాంటి సినిమాలు చేయట్లేదు. అందులోనూ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు వచ్చాక మళ్లీ ఫ్యాక్షన్ సినిమాలు చేస్తా అంటే కష్టమే. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఎన్టీఆర్ తొడకొట్టాలి, కత్తి పట్టి విధ్వంసం సృష్టించాలని కోరుతున్నారు.

నిజంగానే ఎన్టీఆర్ లో ఆ ఊర మాస్ చూసి ఎన్నాళ్లైంది. అసలు ఇప్పుడు మనం చూస్తున్నది ఆ ఎన్టీఆరేనా అనే రేంజ్ లో మార్పు వచ్చింది. ఐతే యాక్టర్ కి కొత్తగా ఒకటి యాడ్ అవుతుందేమో కానీ ఆల్రెడీ ఉన్నది మాత్రం అలానే ఉంటుంది. సో ఎన్టీఆర్ కి మళ్లీ ఒక మంచి ఫ్యాక్షన్ కథ పడితే మళ్లీ వైట్ అండ్ వైట్ కద్దర్ డ్రస్ తో తొడకొట్టి రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి సినిమాలు కూడా ఆయన నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఐతే ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ తెచ్చుకున్న ఎన్టీఆర్ సినిమాల కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. అందుకే ఎలా పడితే అలా సినిమా తీస్తానంటే మాత్రం కుదిరే పని కానట్టుగా ఉంది.