Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ని కలవర పెడుతున్న సంగీత దర్శకుడి ఇష్యూ!

కేజీఎఫ్‌, సలార్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 12:30 PM GMT
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ని కలవర పెడుతున్న సంగీత దర్శకుడి ఇష్యూ!
X

ఎన్టీఆర్‌ తాజాగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందించారు. దేవర సినిమా మ్యూజిక్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్‌ తదుపరి సినిమాలకు సైతం అలాంటి సంగీతం కావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ 'వార్‌ 2' ను చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమాను చేయబోతున్నారు.

కేజీఎఫ్‌, సలార్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు. ఒక వైపు సలార్‌ 2 పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్‌ మరోవైపు ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌లోనూ ఉన్నారట. ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2, సలార్‌ సినిమాలకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. కనుక ఈ సినిమాకు ఆయనే సంగీతాన్ని అందించబోతున్నారు. సలార్‌ 2 కోసం రవి బస్రూర్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరి పోయింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో మాత్రమే రవి బస్రూర్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటూ ఉంది అనే విమర్శలు వస్తున్నాయి.

రవి బస్రూర్‌ సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించి దాదాపు పదేళ్లు అయింది. ఈ పదేళ్లలో పలు తెలుగు సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు. కానీ ఏ ఒక్కటి మ్యూజికల్‌ గా బ్లాక్‌ బస్టర్ అవ్వలేదు. ఇటీవల సైతం ఆయన భీమా సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆ సినిమా మ్యూజిక్‌ పరంగా నిరాశ పరచింది. కన్నడంలో వచ్చిన మార్టిన్ సినిమా లో సైతం రవి బస్రూర్ సంగీతం తేలిపోయింది. పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంత్‌ నీల్‌ తో వర్క్ చేసిన సమయంలో మాత్రమే ఆయన నుంచి బెస్ట్‌ ఔట్‌ పుట్‌ వస్తుందని, అంతుకు మించి ఆయన నుంచి గొప్ప సంగీతాన్ని ఆశించడం వృదా ప్రయాస అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంగీత దర్శకుడు రవి బస్రూర్ విషయం ఇప్పుడు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ని కలవర పెడుతోంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా చేయబోతున్న సినిమాకు ఆయనే సంగీతాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే ఆ విషయం కన్ఫర్మ్‌ అయింది. ఎన్టీఆర్‌ సైతం ఆయన స్టూడియోకి వెళ్లిన విషయం తెల్సిందే. రవి బస్రూర్ నుంచి వస్తున్న సంగీతం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కొన్ని కొన్ని సార్లు మ్యాజిక్‌ పని చేస్తుంది కానీ ఎక్కువ సార్లు ఆయన విఫలం అవుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ మరోసారి ఆయనతో గొప్ప సంగీతాన్ని రాబడుతాడా అనేది చూడాలి. ఎన్టీఆర్‌ సినిమాకు ఎప్పుడైనా పాటలు, బ్యాక్ గ్రౌండ్‌ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మరి ఈసారి ఫలితం ఏంటి అనేది చూడాలి.