మహేష్‌లా ఎన్టీఆర్ కూడా తప్పు చేశాడా?
అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా క్రేజ్‌ని తెచ్చి పెట్టిన `పుష్ప` మూవీని ముందు సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకోవడం తెలిసిందే.
By: Tupaki Desk | 7 April 2025 7:40 AMఒకరి కోసం రెడీ చేసిన భారీ ప్రాజెక్ట్‌లు చేతులు మారి మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్లని అందించడమే కాకుండా సరికొత్త స్టార్ డమ్‌ని తెచ్చి పెట్టాయి. సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన `ఖైదీ` చివరికి మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్లడం..ఆ సినిమాతో చిరు కెరీర్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవడమే కాకుండా సుప్రీమ్ హీరోగా మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం.. ఆ తరువాత హీరోగా టాలీవుడ్‌లో చక్రం తిప్పడం తెలిసిందే. అలా ఓ హీరో కోసం అనుకున్న కథలు చేతులు మారి బ్లాక్ బస్టర్లుగా మారినవి చాలనే ఉన్నాయి.
అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా క్రేజ్‌ని తెచ్చి పెట్టిన `పుష్ప` మూవీని ముందు సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకోవడం తెలిసిందే. స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్, హీరో వేషధారణ, లుంగీలో ఊరమాస్ గెటప్‌లో కనిపించడానికి ఇష్టపడని మహేష్ `పుష్ప` ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేయడం..ఆ వెంటనే అదే ప్రాజెక్ట్‌ని అల్లు అర్జున్‌కు సుకుమార్ చెప్పి తెరకెక్కించడం..అది కాస్తా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలవడం తెలిసిందే. రెండవ భాగం కూడా ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా బన్నీకి తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టింది.
దీంతో మహేష్ తప్పు చేశాడని, తను చేయాల్సిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఇప్పుడు `పెద్ది` విషయంలోనూ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడని ఫీలవడం ఖాయం అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. సాన బుచ్చిబాబు డైరెక్షన్‌లో `పెద్ది` మూవీని రామ్ చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చరణ్ మాస్ లుక్, ఉత్తరాంధ్ర యాస ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేయడమే కాకుండా పూనకాలు తెప్పించింది.
గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 30 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబట్టి రికార్డు సృష్టించింది. 18 గంటల్లోనే `పెద్ది` ఈ ఫీట్‌ని సాధించడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గ్లింప్స్‌కు లభిస్తున్న ఆదరణపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడని అంతా కామెంట్‌లు చేస్తున్నారు. ముందు ఈ ప్రాజెక్ట్‌ని దర్శకుడు బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నారు. స్టోరీ కూడా నెరేట్ చేశారు.
కానీ ఎందుకు ఎన్టీఆర్‌కు ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు. తను తిరస్కరించడంతో ఇదే ప్రాజెక్ట్‌ని రామ్ చరణ్‌కు చెప్పడం, ఆయన వెంటనే అంగీకరించడంతో ఫైనల్‌గా `పెద్ది` పట్టాలెక్కింది. వచ్చే ఏడాది మార్చి 27న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని దక్కించుకుని భారీ వసూళ్లని రాబడితే `పుష్ప` విషయంలో మహేష్‌లా `పెద్ది` విషయంలో ఎన్టీఆర్ తప్పు చేసినట్టుగా భావించే అవకాశం ఉంది.