ఎన్టీఆర్ తో అలియా.. సెట్ చేయండి అంటున్న ఫ్యాన్స్..!
ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అన్నది ఇంకా తెలియలేదు. వార్ 2 లో అయితే కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
By: Tupaki Desk | 31 Jan 2025 3:00 AM GMTదేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఆ సినిమాతో మరోసారి బీ టౌన్ ఆడియన్స్ ని అలరించనున్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అన్నది ఇంకా తెలియలేదు. వార్ 2 లో అయితే కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కామో హీరోయిన్ వేట కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో అలియా భట్ ఈమధ్యనే ఒక జెవెలరీ యాడ్ చేసింది. ఆ యాడ్ చూసిన ఫ్యాన్స్ ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఆల్రెడీ RRR తో అలియా భట్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఐతే అందులో అలియా భట్ సీతారామరాజు అంటే రాం చరణ్ కి జతగా నటించింది. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ తో అలియా సినిమా సెట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఆ తర్వాత మరో బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఎవరో ఒకరు ఎన్టీఆర్ అలియా భట్ కాంబో సెట్ చేస్తే చూసేందుకు చాలా చూడముచ్చటగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో నటించేందుకు అలియా కూడా చాలా ఆసక్తి కనబరుస్తుంది. ఇప్పటికే దేవర లో జాన్వి కపూర్ చేసింది. నెక్స్ట్ వార్ 2 లో కియరా కూడా కనిపిస్తుంది. అలియాతో పాటు మిగతా బాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా ఎన్టీఆర్ జత కడితే చూడాలని ఉందని అంటున్నారు ఫ్యాన్స్.
ప్రశాంత్ నీల్ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు. ఎన్టీఆర్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో హంగామా మొదలవుతుంది. దేవర సినిమా కూడా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. త్వరలో దేవర 2 కూడా ఉంటుందని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్, దేవర రెండు సినిమాలతో నేషనల్ లెవెల్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా భారీ ప్లానింగ్ తో వెళ్తున్నాడు.