యంగ్ టైగర్ కి ఆ సినిమా విషయంలో లైన్ క్లియర్!
కానీ ఇదే టైటిల్ తో యువ నటుడు ప్రదీప్ రంగనాధ్ హీరోగా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది.
By: Tupaki Desk | 18 Feb 2025 12:23 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పట్టాలెక్కడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. తొలుత తారక్ లేని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. అయితే ఈసినిమా టైటిల్ విషయంలో క్లాష్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కానీ ఇదే టైటిల్ తో యువ నటుడు ప్రదీప్ రంగనాధ్ హీరోగా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది.
తొలుత ఈ సినిమాకే 'డ్రాగన్' టైటిల్ ఫిక్స్ అవ్వడం..రిలీజ్ అవ్వడం జరుగుతుండటంతో? తారక్ 31 టైటిల్ మార్చక తప్పదనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా ప్రదీప్ సినిమా టైటిల్ మారిపోయింది. ఈసినిమాకి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. టైటిల్ మార్చడంతో తారక్ 31కి లైన్ క్లియర్ అయింది.
'డ్రాగన్' టైటిల్ ను తమకు ఇచ్చేయాల్సింది గా ప్రశాంత్ నీల్ అండ్ కో అభ్యర్ధించడంతోనే ప్రదీప్ రంగనాధ్ టీమ్ టైటిల్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్స్ విషయంలో పెద్ద సినిమా-చిన్న సినిమా మధ్య క్లాష్ ఏర్పడినప్పుడు చిన్న సినిమాలు వెనక్కి తగ్గి టైటిల్ మార్చుకోవడం అన్నది కొత్తేం కాదు. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలా జరిగింది.
చాలా సందర్భాల్లో నేరుగా హీరోలే టైటిల్స్ విషయంలో చిన్న సినిమా నిర్మాతలతో మాట్లాడి సర్దుబాటు చేసుకున్నారు. ఇలాంటి విషయాల్లో పరిమిత బడ్జెట్ సినిమాల దర్శక, నిర్మాతల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు కూడా వ్యక్తం అవ్వవు.