Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కూడా టాప్ లెవెల్లో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తాజాగా ‘దేవర’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 4:01 AM GMT
ఎన్టీఆర్ కూడా టాప్ లెవెల్లో..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తాజాగా ‘దేవర’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్‌కి మాత్రం ప్రశంసలు గట్టిగానే లభిస్తున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ వన్ మెన్ షో చేసాడనే మాట వినిపిస్తోంది. ఈ కథకు ప్రధాన బలం ఎన్టీఆర్ నటన అని ప్రజలు గొప్పగా చెబుతున్నారు.

దేవర, వర క్యారెక్టర్స్‌ని ఎన్టీఆర్ పోషించిన విధానం అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ మూవీ రిజల్ట్ ఏంటో చెప్పడానికి ఇప్పుడే ఇంకా సమయం ఉంది. అయితే ‘దేవర’ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులతో ఎన్టీఆర్ మంచి కనెక్ట్‌ అయ్యాడని చెబుతున్నారు. ‘దేవర’ మూవీ మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

దీన్ని బట్టి ఈ సినిమాకి ఎంతటి ఆదరణ లభించిందో అర్థమవుతోంది. సరైన కథ పడితే, సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే సత్తా ఎన్టీఆర్‌కి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా ఉన్నారు. వీరిపై నిర్మాతలు 300+ కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే, వీరందరి కంటే వేగంగా పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ స్టార్‌గా నిలబడే సత్తా ఎన్టీఆర్‌కి ఉందనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభాస్ ఎక్కువగా ఇంట్రావర్ట్ లా ఉంటాడు. పెర్ఫార్మెన్స్, హైట్, హీరోయిక్ ఎలివేషన్‌తో ఆకట్టుకున్నప్పటికీ, ప్రభాస్ సాధారణంగా పెద్దగా ఎవరితో కలవడు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్‌కి హిందీ భాషలో మాట్లాడటం రాదు.

నార్త్ ఇండియాలో ప్రమోషన్స్‌కి వెళ్లినప్పుడు వీరిద్దరూ ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా మాట్లాడతారు. కానీ, ఎన్టీఆర్ అనర్గళంగా హిందీ మాట్లాడగలడు. అలాగే, తమిళ్, మలయాళం, కన్నడ భాషల మీద కూడా మంచి పట్టుంది. ఎక్కడికి వెళ్ళినా, స్థానిక భాషలో మాట్లాడి ఎన్టీఆర్ ఈజీగా ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాడు. ‘దేవర’ నార్త్ ఇండియా ప్రమోషన్స్‌లో తారక్ ప్రధానంగా హిందీలోనే మాట్లాడాడు.

యాక్సెంట్ కరెక్ట్‌గా పట్టుకుని మాట్లాడటంతో హిందీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. భవిష్యత్తులో కూడా ఈ లాంగ్వేజ్ టాలెంట్ ఎన్టీఆర్‌కి ప్రధాన బలం అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎక్స్‌ట్రా లాంగ్వేజ్ టాలెంట్ వలన, హిందీ వెర్షన్‌లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఎన్టీఆర్ ఇమేజ్‌కి పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ‘వార్ 2’, ‘డ్రాగన్’ లాంటి సినిమాలతో ఎన్టీఆర్ టాప్ రేంజ్‌లోకి చేరిపోవడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.