Begin typing your search above and press return to search.

దేవర రెండు భాగాలు.. తారక్ ఏం చెప్పాడంటే..?

ఒక సినిమాగా చెప్పడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా చేస్తున్నామని అంటారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 4:54 AM GMT
దేవర రెండు భాగాలు.. తారక్ ఏం చెప్పాడంటే..?
X

ఈమధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఒక మోస్తారు బడ్జెట్ దాటితే చాలు రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అదేంటి బడ్జెట్ దాటితే రెండు భాగాలేంటని అనుకోవచ్చు. ఇది ఆడియన్స్ వెర్షన్ లో వినిపిస్తున్న మాట. కానీ మన మేకర్స్ చెప్పాలనుకున్న కథ పెద్దది అవుతుంది. ఒక సినిమాగా చెప్పడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా చేస్తున్నామని అంటారు. బాహుబలితో మొదలైన ఈ పంథా రాబోతున్న దేవరకు కొనసాగుతుంది.

కొరటాల శివ డైరెక్షన్ లో దేవర ప్రకటన వచ్చాక ముందు సినిమాను ఒక ప్రాజెక్ట్ గానే తీద్దామని అనుకున్నారు. కానీ క్యారెక్టర్స్ బాగా రావడంతో సినిమాను రెండు భాగాలని అనౌన్స్ చేశారు. ఇదే విషయంపై ఎన్ టీ ఆర్ కూడా తన స్పందన తెలియచేశారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో కొరటాల శివ రాసిన కథ చాలా పెద్దది. క్యారెక్టర్స్ ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఐతే ఆయనకు ప్రోత్సాహం అందిస్తూ క్యారెక్టర్స్ డెవలప్ చేయమని చెప్పానని సినిమా ముందు ఒక భాగంగానే చేయాలని అనుకున్నా క్యారెక్టర్స్ బాగా కుదరడం వల్ల రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నామని అన్నారు తారక్.

సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర చూసి తాను సర్ ప్రైజ్ అయ్యానని అన్నారు. సినిమా ఫస్ట్ పార్ట్ కే 5 గంటల రష్ వచ్చింది. సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన సీన్స్ కూడా కొన్ని షూట్ చేశామని అన్నారు తారక్. సో బలమైన కథ బలమైన పాత్రల వల్లే దేవర రెండు భాగాలుగా చేస్తున్నామని ఎన్ టీ ఆర్ చెప్పారు. కొరటాల శివ దేవర కోసం తన ఫుల్ ఎఫర్ట్ పెట్టారని చెప్పిన తారక్ సినిమా కోసం ఆయన పడిన కష్టం చాలా గొప్పదని అన్నారు.

మరో రెండు రోజుల్లో దేవర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్ టీ ఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన దేవర సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొట్టేస్తున్న దేవర ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టేలా ఉంది. ఓవర్సీస్ లో దేవర రికార్డుల మోత మోగిస్తుంది. ప్రీ సేల్స్ తోనే అక్కడ సెన్సేషనల్ అనిపించుకుంటుంది.