దేవర… తొమ్మిది వెనుక ఇంత కథ ఉందా?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలన్ గా చిత్రంలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 29 Aug 2024 2:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో యువసుధా ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలన్ గా చిత్రంలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక యంగ్ ఎన్టీఆర్ చేస్తోన్న దేవర క్యారెక్టర్ అయితే థియేటర్ లో ప్రేక్షకులకి పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ వెనుక ఇంటరెస్టింగ్ న్యూమరాలజీ సెంటిమెంట్ కూడా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఈ సెంటిమెంట్ ని బాగా బిలీవ్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. ఆయనకి ఈ నెంబర్ బాగా సెంటిమెంట్. తన కార్లకి అన్ని 9 వచ్చే విధంగా నెంబర్స్ ఫ్యాన్సీ నెంబర్స్ సెలక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎన్టీఆర్ అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడనే మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో దేవర మూవీ రీరిలీజ్ అవుతోంది. అంటే తొమ్మిదో నెల. అలాగే రిలీజ్ డేట్ 27, 2+7 కలిపిన 9 వస్తుంది.
అలాగే 27వ తేదీన మిడ్ నైట్ 1:08 గంటలకి దేవర మొదటి షో పడబోతోందంట. ఈ టైం టోటల్ కలిపిన 9 వస్తుంది. ఇలా దేవర సినిమాకి 9 సెంటిమెంట్ బాగా కలిసొచ్చే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకొని రిలీజ్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. అయితే దేవరని ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతోంది. తారక్ ఆర్ఆర్ఆర్ కంటే ముందు మూడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.
తరువాత వచ్చిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ సెంటిమెంట్ రాజమౌళితో మూవీస్ చేసిన హీరోలు అందరికి వర్తిస్తోంది. రాజమౌళి క్రియేట్ చేసిన ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకోలేకపోవడం వలన ఆ హీరోల నెక్స్ట్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనేది సినీ విశ్లేషకుల మాట. అయితే దేవర మూవీ విషయంలో ఆ పొరపాటు జరగదని ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నారు.