Begin typing your search above and press return to search.

బాలయ్య - తారక్.. మళ్ళీ దూరం పెట్టారంటే ఎలా?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇటీవల ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Jan 2025 7:00 AM GMT
బాలయ్య - తారక్.. మళ్ళీ దూరం పెట్టారంటే ఎలా?
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇటీవల ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. బాలయ్యకు అవార్డు ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి చేతులమీదుగా ఆ అవార్డును అందుకోనున్నారు నటసింహం. దీంతో ఆయన అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యి.. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


బాలయ్యకు పద్మభూషణ్ వరించడం.. నారా, నందమూరి కుటుంబాల్లో కూడా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించే క్షణం. దీంతో వారంతా సంతోషంగా ఉన్నారు. తాజాగా భారత ప్రభుత్వం బాలయ్యకు ఇచ్చిన గుర్తింపును పండుగలా జరుపుకుంటూ ప్రముఖ వార్తా ప్రతికల్లో భారీ యాడ్ వేశారు. అందుకు సంబంధించిన పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉన్న మాస్ హీరో, అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచే నాయకుడు, క్యాన్సర్ పేషెంట్లు, పేదలను ఆదుకునే ఆప్తుడు, ఒక కొడుకుగా, భర్తగా తండ్రిగా, సోదరుడిగా, తాతగా బాధ్యతలు మరువని వ్యక్తి అంటూ బాలయ్యను కొనియాడారు. మీకు పద్మభూషణ్ అవార్డు రావడం వల్ల మేమందరం ఎంతో గర్విస్తున్నామని, మీరు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని, జై బాలయ్య అంటూ నినదించారు!

అదే సమయంలో ప్రకటన కింద నందమూరి, నారా కుటుంబ సభ్యుల పేర్లు వేశారు. ఆ విషయం.. ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు లేవని, కావాలనే అలా చేసినట్లు ఉన్నారని సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది . ఆ విషయంలో మరికొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య.. తారక్ ను దూరం పెట్టడం ఇదేం మొదటిసారి కాదని, పలు సంఘటనలు ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ ప్రకటన విషయంలో కచ్చితంగా ఒక లాజిక్ ఆలోచించాల్సి ఉంది.

పేపర్ యాడ్ లో ముందుగా బాలయ్య కుటుంబ సభ్యుల పేర్లు (భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు, వారి ఫ్యామిలీ మెంబర్స్) మాత్రమే ముద్రించారు. ఆ తర్వాత బాలకృష్ణ తోబుట్టువులు అంటే సోదరులు, సోదరీమణులు పేర్లను వేశారు. కానీ వారి పిల్లల పేర్లు ఎవరివీ వేయలేదు. అలా ముద్రించాలనుకుంటే.. పేజీలో సగానికిపైగా వస్తుందేమో యాడ్. ఆ విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ.. మొత్తం కుటుంబ వృక్షం పేర్లు మాత్రం వేయాలని అనుకోలేదని అర్ధమవుతుంది.

అయితే ప్రకటనలో బాలయ్య.. సోదరీమణుల పేర్లను వారి భర్తల నేమ్స్ తో కలిపి వేశారు. సోదరుల పేర్లు వారి సతీమణుల నేమ్స్ తో ముద్రించారు. అదే సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ దంపతుల పేర్లు కూడా వేశారు. కానీ హరికృష్ణ పిల్లలు పేర్లను మాత్రమే కావాలనే వేయలేదని అనడం కరెక్ట్ కాదేమో. ఓవరాల్ గా అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల పేర్లతోపాటు బాలయ్య కుటుంబసభ్యులు నేమ్స్ మాత్రమే యాడ్ లో వేశారు.

అంతేగానీ తోబుట్టువుల నెక్స్ట్ జనరేషన్ ఎవరి జోలికి వెళ్లలేదు. అందుకే తారక్, కళ్యాణ్ రామ్ పేర్లు కూడా లేవని చెప్పాలి. అందుకే పేపర్ యాడ్ విషయంలో లాజిక్ ఆలోచించి.. వృధా చర్చ ఆపుకోవడం బెటర్. బాలయ్య బయటకు చెప్పకపోయినంత మాత్రాన ఎన్టీఆర్ తో విబేధాలు ఉన్నట్లు కాదు. ఇక తారక్ రీసెంట్ గా బాలా బాబాయ్ అంటూ అవార్డు వచ్చిన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఏదేమైనా నందమూరి అగ్ర హీరోల మధ్య ఏ వివాదాలు లేకపోయినా ఇప్పుడు ఉన్నట్లు కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.