క్రిష్ -4 లో టాలీవుడ్ బ్రదర్స్ పెట్టుబడులా?
దీంతో నిర్మాణంలో భాగమయ్యే అవకాశం ఎవరికైనా ఉండొచ్చు అన్న దోరణిలో రాకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2025 1:30 PM GMTమానవతీత శక్తుల విన్యాసాల నేపథ్యంలో తెరకెక్కిన 'క్రిష్' ప్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు భాగాలు భారీ విజయం సాధించాయి. దీంతో రెండు మూడేళ్లగా 'క్రిష్ -4'కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు రాకేష్ రోషన్ ఎంతో కేరింగ్ తీసుకుంటున్నారు. స్టోరీ కోసమే కొన్ని సంవత్సరాలుగా పనిచసారు. తాజాగా ఇటీవలే స్టోరీ సహా అన్ని పనులు సిద్దం చేసినట్లు ప్రకటించారు.
మునుపటి భాగాలకంటే మరింత ప్రతిష్టాత్మకంగా 'క్రిష్-4'ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ కి బడ్జెట్ సమస్యలు కూడా తలెత్తినట్లు రాకేష్ రోషన్ ప్రకటించారు. అలాగే రాజీ పడేది లేదని కూడా అన్నారు. 'క్రిష్ -4' పూర్తిగా అంతరిక్షంలోనే చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో టెక్నికల్ గా సినిమా హైలైట్ అవుతోన్న నేపథ్యంలో బడ్జెట్ భారీగా పెరుగుతుంది. దీంతో నిర్మాణంలో భాగమయ్యే అవకాశం ఎవరికైనా ఉండొచ్చు అన్న దోరణిలో రాకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కి టాలీవుడ్ బ్రదర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఎంటర్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో తారక్ లీడ్ తీసుకుని అన్నయ్యని, హరిని ముందుకు తీసుకెళ్తున్నారట. పెట్టుబడి ఎంత అన్నది తెలియదు గానీ నిర్మాణంలో వాటాదారులుగా మాత్రం ఎంటర్ అవుతున్నట్లు బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం తారక్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ -2'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదే తారక్ తొలి హిందీ సినిమా. ఈ ప్రాజెక్ట్ లో హృతిక్ తో నటిస్తున్నప్పటి నుంచి ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్ గానూ మారిపోయారు. ఇప్పుడా స్నేహమే హృతిక్ సినిమా నిర్మాణంలో భాగమయ్యేందుక తీసుకెళ్తుందని తెలుస్తోంది. రాకేష్ రోషన్ స్వయానా హృతిక్ రోషన్ తండ్రి. కుమారుడితో రోషన్ నిర్మిస్తోన్న చిత్రమది. `క్రిష్` అంటే ఇండియా అంతటా ఓ బ్రాండ్. 'వార్ 2' విజయం సాధిస్తే హృతిక్ పాన్ ఇండియాలో పెద్ద స్టార్ గా మారుతాడు. ఆ నమ్మకంతోనే తారక్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా మారుతున్నట్లు కనిపిస్తుంది.