Begin typing your search above and press return to search.

వార్-2 నుంచి తారక్ లుక్ లీక్.. వేరే లెవెల్!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Oct 2024 11:02 AM GMT
వార్-2 నుంచి తారక్ లుక్ లీక్.. వేరే లెవెల్!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న తారక్.. ఇప్పుడు వార్-2తో బీటౌన్ ప్రియులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. అయాన్ ముఖర్జీ నటిస్తున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

వార్-2లో తారక్.. స్పై ఏజెంట్ గా కనిపించనున్నారని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో యాక్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై వార్-2 టీమ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కనీసం పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయన ఫస్ట్ లుక్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. బర్త్ డే రోజు రివీల్ చేస్తారని వార్తలు వచ్చినా.. అది జరగలేదు.

అదే సమయంలో ఇప్పుడు వార్-2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ పిక్స్ లీక్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎవరో తీసిన ఫోటోస్ లా కనిపిస్తున్నాయి. లీక్డ్ పిక్స్ లో బ్రౌన్ కలర్ టీ షర్ట్, ఆర్మీ షర్ట్ వేసుకుని నడుస్తూ కనిపించారు. మాస్ లుక్ లో ఎన్టీఆర్ వేరే లెవెల్ లో ఉన్నారు. ప్రస్తుతం తారక్ పిక్చర్స్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ గా సందడి చేస్తున్నారు.

తారక్ అన్న లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. తమ అకౌంట్స్ లో షేర్ చేస్తున్నారు. అయితే దేవరతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు తారక్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వార్-2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తన పార్ట్ ను కంప్లీట్ చేసేందుకు చూస్తున్నారు.

అదే సమయంలో వార్-2లో తారక్ చేసే యాక్షన్ స్టంట్స్.. సినీ ప్రియులకు షాక్ కు గురిచేస్తాయని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. హృతిక్ రోషన్ తో తారక్ ఫేస్ టు పేస్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు లీక్ అయిన పిక్స్ కూడా అలాంటి సీన్స్ లోనివేనని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు. వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన వార్-2 రిలీజ్ కానుంది.