Begin typing your search above and press return to search.

'వార్‌ 2' కోసం మహేష్‌ బాబు... రాజమౌళి పర్మీషన్‌ ఇచ్చేనా?

ఇలాంటి సమయంలో వార్‌ 2 సినిమా కోసం మహేష్ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలి అంటే కచ్చితంగా రాజమౌళి నుంచి పర్మీషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 10:50 AM GMT
వార్‌ 2 కోసం మహేష్‌ బాబు... రాజమౌళి పర్మీషన్‌ ఇచ్చేనా?
X

ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో 'వార్‌ 2'లో నటిస్తున్న విషయం తెల్సిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందుతున్న వార్‌ 2లో ఎన్టీఆర్ నెగటివ్‌ షేడ్స్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కి దక్కిన స్టార్‌డం నేపథ్యంలో వార్‌ 2 లో ఛాన్స్ దక్కింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌ రోల్‌ గురించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ అంచనాలు పెంచుతోంది.

సినిమా ప్రారంభం సమయంలో కథను పరిచయం చేస్తూ ఒక వాయిస్ ఓవర్‌ రానుందట. హిందీలో వార్‌ 2 కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌ వాయిస్ ఓవర్‌ ఇవ్వనున్నారు. అయాన్ ముఖర్జీతో రణబీర్‌ కపూర్‌కి ఉన్న స్నేహంతో వాయిస్ ఓవర్‌కి ఓకే చెప్పాడని తెలుస్తోంది. రనబీర్‌ కపూర్‌ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అందుకే వార్‌ 2 హిందీ వర్షన్‌కి రణబీర్‌ వాయిస్ ఇవ్వడం దాదాపు కన్ఫర్మ్‌ అయ్యింది. ఇదే సమయంలో తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌తో మహేష్‌ బాబుకి ఉన్న స్నేహంతో ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి హ్యాండోవర్‌లో ఉన్నారు. మహేష్‌ బాబు పాస్‌ పోర్ట్‌ తీసుకుని రాజమౌళి సీజ్‌ చేశాడు. మహేష్‌ బాబు సైతం ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అంటూ రాజమౌళికి పూర్తిగా సరెండర్‌ అయినట్లుగా చెప్పకనే చెప్పారు. ఇలాంటి సమయంలో వార్‌ 2 సినిమా కోసం మహేష్ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలి అంటే కచ్చితంగా రాజమౌళి నుంచి పర్మీషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు రాజమౌళి ఓకే చెప్తారా అనేది చూడాలి. మహేష్ బాబు ఇటీవలే షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఇక మీదట కనీసం ట్వీట్స్ చేసేందుకు కూడా ఖాళీ లేనంత బిజీగా రాజమౌళి సినిమాతో మహేష్ బాబు టైం కేటాయించాల్సి ఉంటుంది.

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ 'వార్‌ 2' సినిమాకి తెలుగులో మరింత బజ్‌ క్రియేట్‌ చేయాలి అంటే మహేష్ బాబు వంటి స్టార్‌ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బ్రహ్మాస్త్ర సినిమా సమయంలో రాజమౌళి, అయాన్ ముఖర్జీ కలిసి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కనుక ఎన్టీఆర్‌తో పాటు అయాన్ ముఖర్జీ అడిగితే రాజమౌళి ఒప్పుకుంటారేమో చూడాలి. వార్‌ 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. వార్‌ 2 షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్‌ వచ్చే నెలలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నాడు.