Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లిస్టులో మరో కోలీవుడ్ డైరెక్టర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 5:02 AM GMT
ఎన్టీఆర్ లిస్టులో మరో కోలీవుడ్ డైరెక్టర్?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 400+ కోట్ల కలెక్షన్స్ అందుకుంది. వీకండ్ అనంతరం 500 కోట్ల కలెక్షన్స్ దాటుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ‘దేవర’ సినిమాకి భారీ వసూళ్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సందడి ఆల్ మోస్ట్ ఎండ్ కి వచ్చేస్తూ ఉండటంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో డ్రాగన్ షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైన్ అప్ లోకి చాలా మంది దర్శకులు వస్తున్నారు. ఇప్పటికే వెట్రిమారన్ తో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేశారు. వెట్రిమారన్ కూడా దీనిని ధృవీకరించారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో కోలీవుడ్ దర్శకుడితో మూవీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ త్వరలో ఎన్టీఆర్ కి కథ చెప్పబోతున్నాడంట.

సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో నెల్సన్ దిలీప్ ఈ మూవీ చేయడానికి సిద్ధం ఆవుతోన్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టోరీ నేరేషన్ ఇచ్చి ఎన్టీఆర్ తో కన్ఫర్మ్ చేసుకోవాలని నెల్సన్ దిలీప్ అనుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ ‘జైలర్ 2’ మూవీ పైన వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దీని తర్వాత చిత్రం ఎన్టీఆర్ తోనే చేయాలని నెల్సన్ దిలీప్ ప్లాన్ చేసుకున్నాడనే ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే అదిరిపోయే కథని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసాడంట.

మరి ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కి అవకాశం ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఎన్టీఆర్ ‘వార్ 2’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తరువాత 2026 సంక్రాంతికి ‘డ్రాగన్’ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. మరోవైపు

నెల్సన్ ‘జైలర్ 2’ షూటింగ్ పై ఉంటుంది. అంటే వీరిద్దరూ కలిసి చేయబోయే ఆ మూవీ 2026 లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మరో మాట.