ఎన్టీఆర్ నీల్.. మిగతాది అంతా చరిత్రే..!
లాస్ట్ ఇయర్ ఆగష్టు నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఎన్టీఆర్ నీల్ సినిమా నేడు సెట్స్ మీదకు వెళ్లింది.
By: Tupaki Desk | 20 Feb 2025 4:25 PM GMTదేవర తర్వాత ఓ పక్క వార్ 2 సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు. కె.జి.ఎఫ్, సలార్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ తారక్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆగష్టు నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఎన్టీఆర్ నీల్ సినిమా నేడు సెట్స్ మీదకు వెళ్లింది. ఓపెనింగ్ సీనే ఒక భారీ యాక్షన్ సీన్ తో మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్.
ఎన్నాళ్ల నుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ సెట్స్ నుంచి రిలీజ్ చేసిన ఫోటో ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఐతే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ తో పాటు ఆయన భార్య లిఖిత రెడ్డి కూడా భాగం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలైన సందర్భంగా నీల్ సతీమణి లిఖిత రెడ్డి తన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు.
ఇంతకీ ఆమె ఏం పెట్టారు అంటే ఫైనల్ గా ఆ టైం వచ్చింది. అతను మైక్ పట్టుకున్నాడు ఇక మిగిలింది అంతా చరిత్ర. ఒక అద్భుతమైన షో డైన్ ప్రారంభమౌతుంది. ఎన్టీఆర్ అన్న సెట్స్ పైకి వచ్చే వరకు వేచి ఉండలేకపోతున్నా అంటూ ఆమె రాసుకొచ్చారు. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం డైరెక్టర్ భార్య కూడా ఎంత ఎగ్జైట్ అవుతుంది అన్నది ఆమె మెసేజ్ ద్వారా తెలుస్తుంది.
ఎన్టీఆర్ మాస్ స్టామినా తెలిసిన ప్రశాంత్ నీల్ దానికి తగినట్టుగా కథ కథనాలు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అన్నారు కానీ ఆ టైం కు రావడం అసలు సాధ్యపడదని చెప్పొచ్చు. మామూలుగా ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలకు భారీ ఎలివేషన్ ఇస్తుంటాడు. ఇప్పుడు ఎన్ టీ ఆర్ ఉన్నాడు కాబట్టి అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
అంతేకాదు నీల్ భార్య పెట్టిన మెసేజ్ చూస్తుంటే ఈ సినిమాలో ఆమె కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. రాజమౌళి స్పూర్తితో ప్రశాంత్ నీల్ కూడా సినిమాలో తన భార్యను కూడా ఇన్వాల్వ్ చేయిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ నీల్ సినిమా మొదలవడం తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.