Begin typing your search above and press return to search.

నీల్ - ఎన్టీఆర్.. ఆంధ్రవాలా తరహాలోనే కానీ..

అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 5:30 PM GMT
నీల్ - ఎన్టీఆర్.. ఆంధ్రవాలా తరహాలోనే కానీ..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ దేనికదే డిఫరెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా అంతకుమించి అనేలా ఉంటాయని ఇప్పటికే అనేక రకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఇక 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామా అని ఒక హింట్ అయితే ఇచ్చారు. లేటెస్ట్ గా వినిపిస్తున్న మరొక టాక్ ఏమిటంటే.. ఈ చిత్ర కథనం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ కథలో ఎన్టీఆర్ బంగ్లాదేశ్ కు వలస వెళ్ళిన తెలుగు సమాజం కోసం నిలబడ్డ వ్యక్తిగా కనిపించబోతున్నారు. గతంలో ఆంధ్రావాలా సినిమా కూడా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఇదే తరహా లైన్ తో వచ్చింది. ముంబైలో ఉండే తెలుగు వారి కోసం నిలబడే లీడర్ గా రెండు భిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే నీల్ యాక్షన్ డోస్ తో మరింత హై లెవెల్లో ఇలాంటి కథను చూపించగలడని టాక్. ఎన్టీఆర్ నటన చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన భారీ ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ని మాస్ లుక్ లో పవర్‌ఫుల్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే, ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ తన గత సినిమాలకు వర్క్ చేసిన బృందాన్ని కూడా ఈ సినిమాకి రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవిబస్రూర్ సంగీతం అందించనుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం బాధ్యతలు చేపట్టారు.

ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’ విజయంతో మంచి హిట్ కొట్టాడు, ఇప్పుడు ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్ లో మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ‘వార్ 2’ షూట్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ కొత్త సినిమా కోసం త్వరలోనే షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి బంగ్లాదేశ్ నేపథ్యంతో తెలుగు వలసలను ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.