Begin typing your search above and press return to search.

నీల్ పై ఈ నిందలు తగునా?

సినిమా క్యాన్సిల్ అని టాక్ వచ్చిన ప్రతీ సారి మస్కర్స్ అయితే సలార్ 2 ఉంటుందని ఏదో ఒక విధంగా హింట్ అయితే ఇచ్చింది.

By:  Tupaki Desk   |   27 March 2025 1:30 PM
Ntr Neel dragon delayed
X

ప్రశాంత్ నీల్–ఎన్టీఆర్ కాంబోపై భారీ అంచనాలున్న నేపథ్యంలో, తాజా పరిస్థితుల్లో ఈ సినిమా ఆలస్యం గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికే రిలీజ్ అని మొదట క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే సలార్ 2 త్వరలోనే అంటూ మరో రకమైన వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సినిమా క్యాన్సిల్ అని టాక్ వచ్చిన ప్రతీ సారి మస్కర్స్ అయితే సలార్ 2 ఉంటుందని ఏదో ఒక విధంగా హింట్ అయితే ఇచ్చింది.

అయితే దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా గా మరికొందరు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ తో నేషనల్ రేంజ్‌కు ఎదిగిన ప్రశాంత్ నీల్, ‘సలార్’తో మాస్ మేకింగ్‌లో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి డైరెక్టర్‌కు పబ్లిసిటీ కోసం ముందస్తు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాల్సిన అవసరం ఉందా? అతను ఒక్క పోస్టర్ వదిలినా కూడా నేషనల్ మీడియా దృష్టి మళ్లేలా చేస్తాడు.

ఈ రోజుల్లో ఒక చిన్న సినిమానే అనుకున్న సమయానికి రావడం లేదు. అలాంటిది పెద్ద సినిమాకు ఒక టార్గెట్ అనుకున్నా వివిధ రకాల కారణాలతో ఆలస్యం అవుతుంటాయి. అలాగే, ‘డ్రాగన్’ సినిమా ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణాలు మరొక కోణంలో చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, అలాగే వార్ 2 లాంటి భారీ ప్రాజెక్ట్‌ను కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉండటంతో డేట్స్ విషయంలో స్వల్ప క్లారిటీ కొరత ఏర్పడింది.

ఈ గ్యాప్‌లో ప్రశాంత్ నీల్ టీం రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేయడం, స్టోరీబోర్డింగ్ పూర్తి చేయడం లాంటి పనులు చేస్తున్నారన్నది వాస్తవం. ఇది అంతా మేనేజ్‌మెంట్‌లో భాగమే అయినా, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్‌ లెవెల్స్ బట్టి అన్నీ సడెన్‌గా జరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తక్కువ టైమ్‌లో ఈ స్థాయి సినిమాను కంప్లీట్ చేయడం అంత సులువు కాదు.

పైగా ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. స్కేల్ పరంగా, విజన్ పరంగా ఇది ఓ పెద్ద ఎటెంప్ట్. అందుకే ఆలస్యం తప్పదు. మరొకవైపు చూస్తే, ప్రశాంత్ నీల్ ఇంకా సలార్ 2 గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఫ్యాన్స్‌లో కొంత అసహనానికి కారణమైనా, ఆయన పనితీరు చూశాక మాత్రం ఎదురుచూడడం వల్ల ఫలితం బాగుంటుందని నమ్మకం ఉంది. కేజీఎఫ్ 2 కూడా అనేక మార్లు వాయిదా పడినా, రిలీజ్ సమయంలో ఇచ్చిన కిక్ వేరే లెవెల్లో ఉంది. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్‌ను మునుపటి అనుభవాలతో తేల్చేయడం తగదు.

మొత్తానికి, డ్రాగన్ ఆలస్యం అవుతోందన్నది నిజమే కానీ, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్‌కు కావాల్సిన ప్రొడక్షన్ టైమ్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌కు సరిగ్గా రైట్ టైమ్, రైట్ ప్లానింగ్ అవసరం. ఈ ఇద్దరూ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఫోకస్‌తో ఉన్నారు. ఒకవేళ ఇదంతా సెట్ అయితే, అనుకున్న సమయానికి వస్తుంది.. లేదంటే వాయిదా తప్పదు. ఎప్పుడొచ్చినా రిజల్ట్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా ఉండబోతుందన్నదే అసలు విషయం.