సంక్రాంతి కొస్తే సలాం కొట్టాల్సిందే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 April 2025 6:30 PMయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలలో తారక్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. నాటి నుంచి తారక్ పోర్షన్ పూర్తయ్యే వరకూ నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది. అందుకు తగ్గట్టు ప్రశాంత్ నీల్ ప్లానింగ్ చేసుకుని రెడీగా ఉన్నాడు.
అయితే ఈసినిమాని అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలోనే సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంటే ఈ సినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడానికి ఇప్పటి నుంచి సరిగ్గా ఎనిమిది నెలలు సమయం ఉంది. ఏడాది సమయం కూడా లేదు. ఈ ఎనిమిది నెలల్లోనే అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలి. నిజంగా అదే జరిగితే ప్రశాంత్ నీల్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతాడు.
ఇంత పెద్ద ప్రాజెక్ట్ 8 నెలల్లో షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేస్తే అతడికి ఇండస్ట్రీ నిజంగా సలాం కొట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కి సహకరించే ఎన్టీఆర్ ని కూడా అంతే గౌరవిం చాలి. ఏడాదిలోపు ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే మాటలా? సాధారణంగా స్టార్ హీరో సినిమా మొదలు పెట్టి అన్ని పనులు ముగించి రిలీజ్ చేయడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది.
అదీ ఓ సింపుల్ స్టోరీతో సెట్స్ కి వెళ్తే. భారీ స్పాన్ ఉన్న కథ అయితే రెండేళ్లకు పైగా సమయం పడు తుంది. అప్పుడు కూడా రిలీజ్ విషయంలో మేకర్స్ స్ఫష్టత ఇవ్వలేరు. పోస్ట్ ప్రొడక్షన్ సగం పనులు పూర్తయ్యే వరకూ గానీ పక్కాగా రిలీజ్ తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేరు. అలాంటింది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ముందే ఇంత క్లియర్ గా ఉండటం అన్నది అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.