ఎన్టీఆర్-నీల్.. ఈ టార్గెట్ సాధ్యమేనా?
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
By: Tupaki Desk | 29 Jan 2025 2:45 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
మేకర్స్ ముందుగా 2026 సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు చాలా సమయం అవసరం ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 10 నెలల వ్యవధిలో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్లాన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయగలరా అనేది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది, తదుపరి ప్రశాంత్ నీల్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమాతో తన కెరీర్లో మరో లెవెల్లో క్రేజ్ అందుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిగణలో ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎలిమెంట్లతో కూడిన పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
షూటింగ్ సమయంలో ఏ చిన్న జాప్యం జరిగినా, రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ, మేకర్స్ ముందుగా ఉన్న ప్లాన్‌ను అమలు చేసే దిశగా కష్టపడుతున్నారు. అదేవిధంగా, ఈ సినిమాకు రుక్మిణి వసంత్‌ని హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమె పాత్ర నిడివి పరిమితంగా ఉండబోతుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ‘సలార్’ లో శృతి హాసన్ పాత్ర తరహాలోనే ఈ సినిమాలో రుక్మిణి పాత్రను కూడా డిజైన్ చేసినట్లు సమాచారం.
మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమవుతున్న ఈ సినిమా నిజంగా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాగలదా లేదా అనేది ఆసక్తిగా మారింది.