Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నీల్ మొద‌లైపోయింది!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రానున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 10:20 AM GMT
ఎన్టీఆర్ నీల్ మొద‌లైపోయింది!
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్ర‌మాలు గ‌తేడాదే పూర్త‌య్యాయి. అప్ప‌ట్నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఎదురుచూపులకు ఇవాళ తెర ప‌డింది.


ఎన్టీఆర్ నీల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అటు ఎన్టీఆర్, ఇటు ప్ర‌శాంత్ నీల్ ఇద్ద‌రూ మాస్ సినిమాల‌కు పెట్టింది పేరు కావ‌డంతో ఈ సినిమా కోసం ఎదురుచూపులు ఎక్కువ‌య్యాయి. ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో నిల‌వ‌డానికి రంగం సిద్ధ‌మైంద‌ని ఓ ఫోటోను పోస్ట్ చేయ‌గా దాన్ని కోట్ చేస్తూ ఎన్టీఆర్ ఇట్ బిగిన్స్.. అంటూ ట్వీట్ చేశాడు.

అయితే షూటింగ్ మొద‌టిరోజే నీల్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. ఏకంగా 3 వేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ను మొద‌లుపెట్టాడు నీల్. మొద‌టి షెడ్యూల్ ప‌ది రోజుల పాటూ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. నెక్ట్స్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొన‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన ప్ర‌శాంత్ నీల్, ఈసారి ఎన్టీఆర్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడ్డానికి ఫ్యాన్స్ ఉవ్విళూరుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా ప్రెజెంట్ చేయ‌బోతున్నాడ‌ట నీల్.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించ‌నున్నాయి. ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌ని నిర్మాత‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నార‌ట‌. ర‌వి బస్రూర్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలున్నాయి.